Share News

Pawan Kalyan: పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే.. ఎవరిచ్చారంటే..?

ABN , Publish Date - Jun 19 , 2024 | 01:18 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన సంతకం చేసిన పెన్ను గురించి చర్చకు దారితీసింది. ఇటీవల పవన్ వదిన సురేఖ ఖరీదైన పెన్ను బహుమతిగా అందజేశారు. ఓ అభిమాని కూడా పెన్ను గిప్ట్‌గా ఇచ్చారు.

Pawan Kalyan: పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే.. ఎవరిచ్చారంటే..?
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన సంతకం చేసిన పెన్ను గురించి చర్చకు దారితీసింది. ఇటీవల పవన్ వదిన సురేఖ ఖరీదైన పెన్ను బహుమతిగా అందజేశారు. ఓ అభిమాని కూడా పెన్ను గిప్ట్‌గా ఇచ్చారు. దీంతో ఆయన ఏ పెన్ను వాడారు..? ఏ పెన్నుతో అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది.


ఏ పెన్నంటే..?

విజయవాడ సూర్యారావుపేటలో గల నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేసి ఛార్జ్ తీసుకున్నారు. ఆ సమయంలో అభిమాని ఇచ్చిన ఎక్స్‌వో పెన్ను ఉపయోగించారు. నిన్న పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి అమరావతి వస్తోండగా ఆయనకు రైతులు అడుగడుగునా నీరాజనం పలికారు ఓ అభిమాని పెన్ను బహుకరించారు. ఆ పెన్నును జాగ్రత్తగా ఉంచుకొని, ఈ రోజు సంతకం చేశారు. ఈ పెన్ను విలువ తక్కువే.. రూ.10కి మార్కెట్‌లో పెన్ను లభిస్తోంది. వదిన ఇచ్చిన రూ. లక్షల పెన్ను కాదని అభిమాని ఇచ్చిన పెన్నుతో పదవి బాధ్యతలను పవన్ కల్యాణ్ స్వీకరించారు.

pawan-pen--off.jpg


అభిమానానికి విలువ

పవన్ కల్యాణ్ సింపుల్‌గా ఉంటారు. ఆడంబరాలు అంటే నచ్చవు. అందుకే అభిమాని ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. ఫ్యాన్స్ పవన్ ఎంత అభిమానిస్తారో.. పవన్ కూడా అదే స్థాయిలో వారికి ప్రయారిటీ ఇస్తారని దీనిని బట్టి అర్థం అవుతోంది.

pawan-pen--vadina.jpg

Updated Date - Jun 19 , 2024 | 01:42 PM