Pawan Kalyan: చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన పవన్..
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:07 PM
ఏపీ ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మరీ శ్రమించారు. ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు.
అమరావతి: ఏపీ ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మరీ శ్రమించారు. ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు. పనితనం ఆదర్శమంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు నాయకత్వం, పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకమని.. ప్రశంసనీయమని కొనియాడారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని చంద్రబాబుని పవన్ కల్యాణ్ కొనియాడారు.
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారూ, మీ ప్రోత్సాహకరమైన మాటలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనా సంక్షోభం, సంస్థాగత క్షీణత, వనరుల దోపిడీ వారసత్వాన్ని మిగిల్చింది. ఈ సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య.. ఇప్పుడు అపూర్వమైన ప్రకృతి వైపరీత్యాల మధ్య, మీ నాయకత్వం, పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం. అటువంటి సమయాల్లో మన ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వంతో పాటు నా వ్యక్తిగత బాధ్యతగా నేను భావిస్తున్నాను. సహాయక చర్యల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి మనం త్వరలోనే బయటపడతామని నేను ఆశిస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు యుద్దప్రతిపదికన పాల్గొంటున్నారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడుతామని ఆశిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.