Pawan kalyan: ఆద్యతో పవన్ సెల్ఫీ.. నెట్టింట పెద్ద ఎత్తున వైరల్..
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:55 PM
కూతురుని ఇష్టపడని తండ్రి ఎవరైనా ఉంటారా? అది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఎవరైనా సరే.. కూతురంటే మక్కువ చూపాల్సిందే. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అతీతులేం కాదు.
![Pawan kalyan: ఆద్యతో పవన్ సెల్ఫీ.. నెట్టింట పెద్ద ఎత్తున వైరల్..](https://media.andhrajyothy.com/media/2024/20240727/pawan_f6ecd3fdb5_v_jpg.webp)
కాకినాడ: కూతురుని ఇష్టపడని తండ్రి ఎవరైనా ఉంటారా? అది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఎవరైనా సరే.. కూతురంటే మక్కువ చూపాల్సిందే. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అతీతులేం కాదు. గతంలో రేణు దేశాయ్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పవన్‌కు ఆయన కుమార్తె ఆద్యతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. అప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఇటీవలి కాలంలో పవన్ చాలా సందర్భాల్లో అది అక్షరాలా నిజం అని చెప్పకనే చెప్పారు. ఇక ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు పవన్ కూతురు ఆద్యతో కలిసి హాజరయ్యారు. కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తండ్రీ కూతుళ్లు సందడి చేశారు. అక్కడ ఆద్యతో పవన్ తీసుకున్న సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనసేన కేడర్, పవన్ అభిమానులు ఆ ఫోటోని చూసి తెగ మురిసిపోతున్నారు. దానికి నెట్టింట పెద్ద ఎత్తున షేర్లు, లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.