CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:50 PM
ఎన్నికల్లో కళ్ళు తిరిగే మెజార్టీని ప్రజలు తమకు అందించారని.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు. నేడు అనకాపల్లికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అనకాపల్లి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కళ్ళు తిరిగే మెజార్టీని ప్రజలు తమకు అందించారని.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. నేడు అనకాపల్లికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు శ్వేత పత్రాలు విడుదల చేశామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వచ్చన్నారు. ఐదేళ్ళ క్రితం ఎలా ఉందో పోలవరం ఎడమ కాలువ ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరమని.. డయా ఫ్రమ్ వాల్‌ను గోదావరిలో కలిపేశారన్నారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వవచ్చని చంద్రబాబు తెలిపారు.
శాశ్వతంగా..!
ప్రాజెక్టు పూర్తి అయ్యే లోపు పుష్కర లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వవచ్చన్నారు. ఈ రోజు టెండర్లు పిలిచి పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. పుష్కర లిఫ్ట్ ద్వారా 2.20 లక్షల ఎకరాలకు మొదటి విడతలో నీళ్ళు ఇవ్వవచ్చన్నారు. అలాగే అనకాపల్లిలో ఇంటింటికీ నీరు ఇవ్వవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకూ వళుతుందన్నారు. ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీ సీఎం రమేష్‌కు, మంత్రి అనితకు ఈ సమస్యపై దృష్టి పెట్టమని చెప్పానని చంద్రబాబు వెల్లడించారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ముందు పోలవరం, తరువాత అమరావతి వెళ్లానని వెల్లడించారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయం మాకు ఉత్తరాంధ్రలో ఇచ్చారని.. రుణపడి ఉంటామని చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!
Read Latest AP News And Telugu News