Share News

Pinnelli : పిన్నెల్లిపై మరో 307

ABN , Publish Date - May 26 , 2024 | 02:15 AM

పోలింగ్‌ అరాచకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై శనివారం మరో కేసు నమోదైంది.

Pinnelli : పిన్నెల్లిపై మరో 307

కారంపూడి సీఐని కొట్టిన ఘటనలో కేసు నమోదు

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడిని అడ్డుకున్న సీఐ

ఆయనపైనా విరుచుకుపడ్డ వైసీపీ మూకలు

తాజాగా సీఐ వాంగ్మూలంతో పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు

గుంటూరు, మే 25(ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ అరాచకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై శనివారం మరో కేసు నమోదైంది. పల్నాడుజిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితునిగా పోలీసులు చేర్చారు. సీఐ వాంగ్మూలం మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్‌ 307 నమోదు చేశారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌ తర్వాత రోజున సీఐ నారాయణస్వామిపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వం వహించారు. కారంపూడిలో టీడీపీ నాయకుడు తండా జాని అలియాస్‌ బొడ్డు, జైన్‌లపై దాడి చేసి వారి కారుకు వైసీపీ గూండాలు నిప్పంటించారు. వారిని అడ్డుకోవడానికి కారంపూడి సీఐ నారాయణస్వామి అన్నివిధాలా ప్రయత్నించారు. అయితే, పోలీస్‌ అధికారి అని కూడా చూడకుండా నారాయణస్వామిపై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరిచాయి. తొలుత పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనపై దాడి పిన్నెల్లి సోదరుల పనేనని సీఐ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే, ఈ ఘటనపై వీఆర్వో-2 పలిశెట్టి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులతోపాటు మరో పది మందిపై 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా పిన్నెల్లి సోదరులు గుట్టుచప్పుడు కాకుండా బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఏజెంట్‌ను కొట్టిన కేసులో రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఒక 307 కేసు నమోదైంది. ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో దౌర్జాన్యానికి సంబంధించి టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసు పెట్టారు. పోలింగ్‌ కేంద్రంలో రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్‌ ధ్వంసం చేస్తున్న సందర్భంగా శేషగిరిరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై దుర్భాషలాడి, బయటకు లాగి మారణాయుధంతో తలపై దాడి చేశారు. ఈ దాడిలో శేషగిరిరావు తలకు ఆరు కుట్లు పడ్డాయి. భయం గుప్పిట్లో వారం రోజుల తర్వాత అజ్ఞాతం వీడి.. టీడీపీ మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, ఎస్టీ నేత ధారునాయక్‌లతో కలిసి ఆయన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


బెయిల్‌ వచ్చింది ఒక కేసు కేసులోనే..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అయితే ఆయనపై నమోదైన ఇతర కేసులపై పోలీసులు ఏం చర్య తీసుకుంటారనేది అంతు పట్టకుండా ఉంది. ఎన్నికల రోజున, ఆ తర్వాత మాచర్లలో అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులను పోలీసు లు అరెస్టు చేేస్త మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి వ చ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ పిన్నెల్లి పేరు చెబితే చాలా మంది భయపడుతున్నారు. ఆయన చేసిన అరాచకాలపై ఫిర్యాదులు చేేసందుకు ఇప్పుడిప్పుడే బాధితులు దైర్యంగా ముందుకు వస్తున్నారు.

ఆర్‌వో సూచన మేరకే...

రెంటచింతల మండలం రెంటాలలో ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్‌ బూత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఎమ్మెల్యే పిన్నెల్లిని అక్కడున్న పీవో, ఏపీ వో గుర్తించి లేచి నిలబడి నమస్కారం చేశారు. అయి తే ఈవీఎం ధ్వంసం చేసింది మాత్రం గుర్తు తెలియని వ్యక్తులని వారిద్దరు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీని వెనక మాచర్ల నియోజకవర్గ ఆర్‌వో ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసు పెట్టే సందర్భంలో గుర్తుతెలియని వ్యక్తులు చేశారని ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పడం వల్లే పీవో, ఏపీవో ఆ విధంగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బాధితుడికి చంద్రబాబు ఫోన్‌

‘‘భయపడకండి బ్రదర్‌.. నేను ఉన్నాను.. అధైర్య పడకండి. అండగా ఉంటాను’’ అని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట పోలింగ్‌ బూత్‌ టీడీపీ ఏజెంట్‌ నోముల మాణిక్యరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో ధైర్యం చెప్పారు. నోముల తనపైనా, కుటుంబంపైనా జరిగిన దాడి గురించి శుక్రవారం ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ డిబేట్‌లో వివరించిన విష యం తెలిసిందే. విదేశాల్లో ఉన్న చంద్రబాబు దీనిపై ఫోన్లో మాణిక్యరావును శనివారం పరామర్శించారు. టీడీపీ నేతలు తమను కుటుంబసభ్యులుగా చూస్తూ అండగా నిలవడం ఆనందంగా ఉందని నోముల మాణిక్యరావు అన్నారు.

ఈసీ సీరియస్‌

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అరాచకా లు రోజుకొకటి వెలుగులోకి వస్తుండటంతో ఈసీ సీరియ్‌సగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు దాడులకు సంబంధించి పిన్నెల్లిపై వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసుల వివరాలను రా ష్ట్ర ఎన్నికల అధికారులు.. ఈసీకి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనపై కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - May 26 , 2024 | 02:17 AM