TDP: టీడీపీ - జనసేన కూటమికి జగన్ భయపడుతున్నారు
ABN , Publish Date - Jan 02 , 2024 | 06:05 PM
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. బాబు ఈ నెల 7న ఆచంట రానున్నట్లు తెలిపారు.
పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. బాబు ఈ నెల 7న ఆచంట రానున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "లక్షల మంది అభిమానులు, కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభ నిర్వహిస్తాం.సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను వేదిక సాక్షిగా ప్రశ్నిస్తాం. 175 సీట్లు వస్తాయని ఢాంబీకాలు పలుకుతున్న జగన్ 85 మందికి సీట్లు నిరాకరించడంతోనే ఆయన ఓటమిని నిర్ణయమైపోయింది. టీడీపీ, జనసేనల ఆలోచనలను సభ వేదికగా వెల్లడిస్తాం.
జగన్ ఎన్ని అడ్డదారులు తొక్కినా రాబోయే టీడీపీ - జనసేన ప్రభుత్వమే. దుర్మార్గపు పాలనను అంతమొందించాల్సిన సమయం వచ్చింది. మా కూటమిని చూసి జగన్ భయపడుతున్నారు" అని విమర్శించారు.