Deputy CM Pawan Kalyan : 100 పడకలకు పిఠాపురం ఆస్పత్రి
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:05 AM
ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిని...
నెరవేరిన పవన్ కల్యాణ్ హామీ.. జీవో జారీ
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిని ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో అక్కడి 30 పడకల సీహెచ్‌సీని వందకు పెంచుతానని హామీ ఇచ్చారు. తాజాగా ఆస్పత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.38.32 కోట్లు విడుదల చేసింది. పెరిగిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డుల నిర్మాణానికి వీటిని ఉపయోగిస్తారు. కొత్తగా 66 మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి వస్తారు. జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.