Share News

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:16 AM

పోలవరం ప్రాజెక్టు ఎగువన నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు...

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

పోలవరం, జూలై 4: పోలవరం ప్రాజెక్టు ఎగువన నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, మానేరు, ప్రాణహిత, మంజీర, పూర్ణ, ప్రవర, పర్ణ నదుల నీటిమట్టం పెరిగి గోదావరిలో నీరు చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 26.390 మీటర్లు, దిగువన 16.430 మీటర్లు, ఎగువ కాఫర్‌ డ్యాం ఎగువన 26.480 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యాం దిగువన 16.520 మీటర్లు నీటిమట్టం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. స్పిల్‌వేలోకి వస్తున్న వరద జలాలను ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్టు ఈఈలు మల్లికార్జునరావు, పి.వెంకటరమణ తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 05:17 AM