గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:30 AM
ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు.
25 కిలోల గంజాయి, 11.06 లక్షలు స్వాధీనం
కృష్ణాదేవిపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి పార్కు వద్ద ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఏజెన్సీ నుంచి వస్తున్న కారులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు తనిఖీ చేయగా డిక్కీలో రెండు ప్లాసిక్ సంచుల్లో 25 కిలోల గంజాయి లభించింది. బానెట్‌లో రూ.11.06 లక్షల నగదు గుర్తించారు. కర్ణాటకకు చెందిన పరుశురాం అలియాస్ ప్రశాంత్, రవీంద్ర నుంచి 3 సెల్‌ఫోన్లు, గంజాయి, నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. నిందితులు 4రోజుల క్రితం గంజాయి కొనుగోలుకు రూ.12.5 లక్షలతో అల్లూరి జిల్లా జీకే వీధి ప్రాంతానికి వెళ్లారు. పోలీసు నిఘా ఉండడంతో ఎక్కువ మోతాదులో గంజాయి రవాణా చేయలేమని భావించి రూ.1.25 లక్షలతో 25 కిలోలు కొనుగోలు చేశారు. మిగిలిన నగదు బానెట్‌లో ఉంచారు. నిందితులను కోర్టు ఆదేశాల మేరకు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.