Share News

నూరుశాతం బయోమెట్రిక్‌ హాజరు

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:23 AM

సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్‌ హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరును ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు.

నూరుశాతం బయోమెట్రిక్‌ హాజరు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

అందరూ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి

సచివాలయ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్‌ హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరును ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై దృష్టి సారించాలన్నారు. బయోమెట్రిక్‌ హాజరును జీతాలకు అనుసంధానం చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి జియోట్యాగింగ్‌ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అందరి బ్యాంకు ఖాతాలను ఎన్‌సీఐతో మ్యాపింగ్‌ చేయాలని, హౌస్‌హోల్డ్‌ క్లస్టర్లను ఆయా ఆవాసాలు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. సచివాలయాల వారీగా 0 నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్‌ అప్‌డేషన్‌ ప్రక్రియను వందశాతం పూర్తిచేయాలన్నారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. త్వరలో సామూహికంగా ఇళ్ల ప్రారంభోత్సవాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోనూ లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మొత్తం 3,800 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంకాగా ఇప్పటివరకు 2,101 పూర్తి చేశారన్నారు. మిగిలినవి కూడా పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో అవసరమైన తాగునీటి అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్నతరహా సంస్థల స్థాపనకు పక్కాగా సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలోని 73 సచివాలయాల్లో ఈ సర్వే చేయాలన్న కలెక్టర్‌.. వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు చిరంజీవి, బాలశంకరరావు, శ్రీనివాసప్రసాద్‌, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, హేన సుజన, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:23 AM