Share News

3వేల రేషన్‌బియ్యం బస్తాలు సీజ్‌

ABN , Publish Date - Nov 07 , 2024 | 01:32 AM

సంతనూతలపాడులోని మద్దులూరు రోడ్డులో ఉన్న నాగరాజ ట్రేడర్స్‌ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 3వేల రేషన్‌ బియ్యం బస్తాలను ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్‌ ఆ దిలక్ష్మి బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.

3వేల రేషన్‌బియ్యం బస్తాలు సీజ్‌

ఎస్‌ఎన్‌పాడు రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన మాఫియా

పట్టుకున్న ఆర్డీవో, తహసీల్దార్‌

సంతనూతలపాడు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): సంతనూతలపాడులోని మద్దులూరు రోడ్డులో ఉన్న నాగరాజ ట్రేడర్స్‌ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 3వేల రేషన్‌ బియ్యం బస్తాలను ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్‌ ఆ దిలక్ష్మి బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. రేషన్‌బియ్యం అక్రమంగా ఉం చారన్నా సమాచారంతో వారు తమ సిబ్బందితో రైస్‌మిల్లుపై దాడి చేశారు. అక్కడ బయట వాహనాల్లో లోడ్‌చేసి ఉన్న రేషన్‌ బియ్యం బస్తాలను, అ లాగే లోపల పెద్ద కుప్పలుగా పోసిన బియ్యాన్ని అధికారులు చూసి విస్తు పోయారు. వెంటనే జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి పద్మశ్రీ, ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యం బస్తా లను వారికి అప్పగించారు. వాటిని ఇక్కడ నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో తెలిపారు. నిందితులపై పూర్తి విచారణ అనంత రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 07 , 2024 | 06:37 AM