Share News

370 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:56 PM

అక్రమంగా తరలి స్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్‌పీ కులశేఖర్‌ ఆదేశాను సారం సీఐ ఎన్‌.రాఘవరావు ఆధ్వర్యంలో బుధవారం అర్ధరా త్రి బొద్దికూరపాడు-రాజంపల్లి మార్గంలో వెళుతున్న లారీని తనిఖీ చేయగా 370 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి.

370 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

తాళ్లూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలి స్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్‌పీ కులశేఖర్‌ ఆదేశాను సారం సీఐ ఎన్‌.రాఘవరావు ఆధ్వర్యంలో బుధవారం అర్ధరా త్రి బొద్దికూరపాడు-రాజంపల్లి మార్గంలో వెళుతున్న లారీని తనిఖీ చేయగా 370 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి.

అందిన సమాచారం మేరకు.. బొద్దికూరపాడు కేంద్రంగా అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం సాగిస్తున్నారు. ఆగ్రామంలో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా లారీలో తరలిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు చింతపాలెం సమీపంలో లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో కొన్ని రేషన్‌ బియ్యం బస్తాలు, మరికొన్ని తెల్లగోతాల్లో ఉంచి ధాన్యంలా నమ్మించేందుకు యత్నించారు. వాటిని లెక్కించగా 50 కేజీలకు చెందిన 370 బస్తాల్లో (18వేల400 కెజీల) రేషన్‌ బియ్యం ఉన్నట్టు నిర్ధాంచారు.

లారీ డ్రైవర్‌ షేక్‌ ఇస్మాయిల్‌, లారీ యజమాని రఆర్‌.లక్ష్మీనారాయణలను విచారించారు. తూర్పుగంగవరంగ్రామానికి చెందిన గుజ్జుల సుబ్బారెడ్డి(డీఆర్‌), బొద్దికూరపాడు గ్రామానికిచెందిన పులి సుబ్బారెడ్డి అక్రమ మార్గంలో బియ్యాన్ని తరలిస్తున్నారు. మండలంలోని గ్రామాల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని బొద్దికూరపాడులో లోడు చేసుకొని తరలిస్తు న్నట్టు విజిలెన్స్‌ అధికారుల విచారణలో తెలిపారు. పట్టుబడ్డ రేషన్‌ బియ్యం వాహనాన్ని తాళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చీమకుర్తి ఎంఎస్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు.

లారీ డ్రైవర్‌షేక్‌ ఇస్మాయిల్‌, లారీ యజమాని ఆర్‌.లక్ష్మీనారాయణ, గుజ్జుల సుబ్బారెడ్డి(డీఆర్‌), పులి సుబ్బారెడ్డిలపై విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎస్‌ఐ జి.నాగేశ్వరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వీవీ లక్ష్మీప్రసన్న, పీసీ మాగంటి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:56 PM