Share News

బల్లికురవ మండలానికి 50 ట్రాన్స్‌ఫార్మర్లు

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:38 PM

వ్యవసాయ పంటలకు రైతులు విద్యుత్‌ లైన్ల కోసం గతంలో దరఖాస్తులు ఇచ్చి ఏళ్లుగా కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెంటనే వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను మంజురు చేయాలని ఆదేశాలిచ్చారు.

బల్లికురవ మండలానికి 50 ట్రాన్స్‌ఫార్మర్లు

మంత్రి గొట్టిపాటి ఆదేశంతో మంజూరు

రైతుల కృతజ్ఞతలు

బల్లికురవ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ పంటలకు రైతులు విద్యుత్‌ లైన్ల కోసం గతంలో దరఖాస్తులు ఇచ్చి ఏళ్లుగా కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెంటనే వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను మంజురు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈమేరకు బల్లికురవ మండలానికి 50 నూతన వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు శనివారం వచ్చాయి. మెత్తం 180 మంది రైతుల దరఖాస్తులకు సంబందించిన ట్రాన్స్‌ఫార్మర్లను సోమవారం ప్రత్యేక మేళా పెట్టి రైతులకు ఒకే సారి ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందజేస్తామని అ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. వైదనకు 10, వెలమవారిపాలెంకు 9, ఎస్‌ఎల్‌గుడిపాడుకు 5, కొమ్మినేనివారిపాలెం 4, కొణిదెన 3, ముక్తేశ్వరం 2, చెన్నుపల్లి 3, మరి కొన్ని గ్రామాలకు 6, దొంగతనాలకు గురైన 8 ట్రాన్స్‌ఫార్మర్లను రైతులకు అందజేస్తామని రైతులు విద్యుత్‌ శాఖ కార్యాలయానికి రావాలని ఏఈ కోరారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే మారు పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. మంత్రి గొట్టిపాటికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 02 , 2024 | 11:38 PM