చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:32 AM
బాలల హక్కుల పరిరక్షణకు సంబంధి త చట్టాలపై అధికారులందరికీ సమగ్ర అవగా హన అవసరమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్ర జ్యోతి): బాలల హక్కుల పరిరక్షణకు సంబంధి త చట్టాలపై అధికారులందరికీ సమగ్ర అవగా హన అవసరమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా బంగారు బా ల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున బా లలకు సంబంధించిన చట్టాలపై జిల్లా స్థాయి అధికారులకు గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌హాలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బాలల హక్కులు, వారి రక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పథకాలు, వాటిని పొందేం దుకు కావాల్సిన అర్హతలపై ప్రజలకు విస్తృతం గా అవగాహన కల్పించాలన్నారు. అందులో భా గంగా తొలుత అధికార యంత్రాంగానికి ఈ అ వగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. అనంతరం పలు అంశాలపై దిశానిర్దేశం చే శారు. కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఎయిడ్ డిఫె న్స్ కౌన్సిల్ రవిశంకర్, డిప్యూటీ చీఫ్ ఎయిడ్ డి ఫెన్స్ కౌన్సిల్ పీవీ.రాఘవులు, డీఆర్వో చిన్నఓ బులేషు, అధికారుల మాధురి, సామా సుబ్బా రావు, ఆర్డీవోలు లక్ష్మిప్రసన్న, కేశవర్థన్‌రెడ్డి, స్వ చ్చంధసంస్థల ప్రతినిధి ఆర్.సునీల్ తదితరులు పాల్గొన్నారు.