పూనూరులో శిథిలావస్థలో పశు వైద్యశాల
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:19 PM
యద్దనపూడి మండలంలో పూనూ రు పెద్ద గ్రామం. ఈ గ్రామంలోని పశువైద్యశాల ప్రస్తు తం శిథిల దశకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో పశుపోషకులు ఈ ఆ సుపత్రికి పశువులను తీసుకొ స్తుంటారు. అంతేగాకుండా గన్నవరం, మున్నంగివారిపాలెం, చిం తగుంటపాలెం గ్రామాలకు చెం దిన పోషకులు కూడా వైద్యం కోసం ఈ ఆస్పత్రికే పశువులను తెస్తారు.
భయంతో సిబ్బంది విధులు
నూతన భవన నిర్మాణానికి కృషి చేయాలని పోషకుల విజ్ఞప్తి
యద్దనపూడి, (మార్టూరు) డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : యద్దనపూడి మండలంలో పూనూ రు పెద్ద గ్రామం. ఈ గ్రామంలోని పశువైద్యశాల ప్రస్తు తం శిథిల దశకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో పశుపోషకులు ఈ ఆ సుపత్రికి పశువులను తీసుకొ స్తుంటారు. అంతేగాకుండా గన్నవరం, మున్నంగివారిపాలెం, చిం తగుంటపాలెం గ్రామాలకు చెం దిన పోషకులు కూడా వైద్యం కోసం ఈ ఆస్పత్రికే పశువులను తెస్తారు. అయితే పశు వైద్యశాల భవనం శిఽథిల దశకు చేరింది. భవనంలోపల పైకప్పుకు సంబందించి సిమెంట్ స్లాబలు రాలిపోవడంతో లోపలున్న ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. దాంతో వైద్య సేవలను అందించే వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో ఏ క్షణంలోనైనా భవనం పడిపోతుందోనని భయం భయంగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ భవనాన్ని గ్రామస్థులు బత్తుల చినకోటయ్య కుమారుడు రామయ్య జ్ణాపకార్థం గన్నమనేని కోటయ్య 1971లో సొంతనిధులతో ని ర్మాణం చేయించారు. అప్పటి నుంచి ఈ భవనంలో పశువైద్యశాలను నిర్వహిస్తున్నారు. దాదాపుగా 53 ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో శిథాలవస్థకు చేరింది. గ్రామంలోని టీడీపీ నాయకులు కొత్తభవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు కృషి చేయాలని పశు పోషకులు కోరుతున్నారు.