Share News

జిల్లాకు భారీ ప్రాజెక్టు

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:24 AM

జిల్లాకు భారీ ప్రాజెక్టు వస్తోంది. ఈ మేరకు మంత్రి లోకేష్‌, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకే్‌షలతోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో కూటమికి భారీ విజయం లభించడంతో అటు కేబినెట్‌, ఇటు కార్పొరేషన్‌ పదవుల్లోనూ ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చారు.

జిల్లాకు భారీ ప్రాజెక్టు
సీఎం చంద్రబాబుతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు

కనిగిరిలో తొలి బయో ఇంధన యూనిట్‌

వచ్చే నెలలో శంకుస్థాపన

మరో నాలుగు యూనిట్లు వచ్చే అవకాశం

దొనకొండ కారిడార్‌కూ మంచి రోజులు

అభివృద్ధిలో ప్రకాశం జిల్లాకు పెద్దపీట : లోకేష్‌

వెలిగొండపై మాట నిలబెట్టుకున్నాం : చంద్రబాబు

కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే జిల్లాకు భారీ ఊరట లభించింది. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్ట్‌ను కేటాయించడంతోపాటు వివిధ సంస్థల ఏర్పాటులో ప్రకాశం జిల్లాకు పెద్దపీట వేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే వెలిగొండ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించామని సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ బయో ఇంధన ప్రాజెక్ట్‌ తొలి యూనిట్‌ను కనిగిరిలో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోవడమేగాక వచ్చే నెలలోనే శంకుస్థాపన చేస్తామని సీఎం స్పష్టమైన ప్రకటన చేశారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాకు భారీ ప్రాజెక్టు వస్తోంది. ఈ మేరకు మంత్రి లోకేష్‌, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకే్‌షలతోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో కూటమికి భారీ విజయం లభించడంతో అటు కేబినెట్‌, ఇటు కార్పొరేషన్‌ పదవుల్లోనూ ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా రిలయన్స్‌ సంస్థ బయో ఇంధన ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మూడు నెలల క్రితం లోకేష్‌ ముంబై వెళ్లి రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని కలిసొచ్చారు. మంగళవారం ప్రభుత్వంతో రిలయన్స్‌ సంస్థ బయో ఇంధన ప్రాజెక్ట్‌ను రాష్ట్రం లో ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకుంది.

కనిగిరిలో తొలి యూనిట్‌

రిలయన్స్‌ ఏర్పాటు చేసే బయో ఇంఽధన ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువ యూనిట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కనిగిరిలో తొలి యూనిట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి వచ్చేనెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు లోకేష్‌ మంగళవారం ప్రకటించారు. ఈ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారు 1,200 ఎకరాలు

అవసరం. అందులో వీలైనంత మేరకు ప్రభుత్వ భూమిని సేకరిస్తారు. అవసరమైతే రైతుల భూములను కూడా తీసుకుంటారు. రైతుల నుంచి తీసుకున్న భూమికి ఏటా కౌలు కూడా వారే చెల్లిస్తారు. మోటార్‌ వాహనాలు వినియోగించే సీఎన్‌జీ గ్యాస్‌ను గడ్డి నుంచి ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత వివిధ రకాలుగా వినియోగపడే గ్యాస్‌, విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమయ్యే విధంగా ఆ యూనిట్‌ను నిర్వహిస్తారు. గడ్డి పంటసాగుకు రైతుల సహకారం కూడా అవసరం. ఈ యూనిట్‌ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఇంటికొక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ ఏర్పాటుకు సేకరించిన భూములు ఖాళీగా ఉండటం, ఇతరత్రా భూములు సేకరించేందుకు రైతులు సహకరిస్తారని సీఎంకు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి వివరించారు. దీంతో తొలి యూనిట్‌ను కనిగిరి ప్రాంతంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.


నాలుగు యూనిట్లు ఏర్పాటుకు చర్యలు

కాగా మంగళవారం ఉదయం ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్యెల్యేలు లోకే్‌షను కలవగా కనీసం నాలుగు యూనిట్లనైనా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, అందుకు అవసరమైన స్థలాలను చూడాలని లోకేష్‌ చెప్పారు. దొనకండ పారిశ్రామిక కారిడార్‌ ప్రస్తావన కూడా రావడంతో అక్కడ ఒక యూనిట్‌ ఏర్పాటుకు పరిశీలిద్దామని లోకేష్‌ చెప్పినట్లు తెలిసింది.పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నందున ఆ ప్రాంతానికి ఎక్కువ యూనిట్లు ఇద్దామని చెప్పారు. పర్చూరు నియోజకవర్గంలో కూడా భూములు కేటాయిస్తామని ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి లోకే్‌షన కోరారు. ఒక యూనిట్‌ ఏర్పాటుకు 1,200 ఎకరాలు సరిపోయినా, గడ్డి సాగు తదితరాలకు కనీసం 30వేల ఎకరాలు అవసరమని రిలయన్స్‌ సంస్థ సూచించింది.

వెలిగొండపై వెనుకడగు లేదు.. కొత్త జిల్లా ఏర్పాటు చేద్దాం

సీఎం చంద్రబాబును ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు కలిశారు. వెలిగొండ నిర్మాణానికి బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు ‘2022లో మీ పుట్టిన రోజున వెలిగొండపై హామీ ఇచ్చారని గుర్తుచేయగా,.. గుర్తుంది, ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది తానేనని, ఈ దఫా ప్రారంభించేది కూడా తానే’నని చంద్రబాబు చెప్పారు. అనంతరం మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించగా చేద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఉదయం లోకే్‌ష్‌ను, సాయంత్రం చంద్రబాబును కలిసిన వారిలో మంత్రులు రవికుమార్‌, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ఏలూరి సాంబశివరావు, అశోక్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, నారాయణరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 01:24 AM