Share News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మోటార్‌ బైకు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:22 PM

మండల పరిధిలోని వీర్ల కొండ గ్రానైట్‌ క్వారీల సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుండి బైకుపై వస్తున్న కార్మికులు శనివారం రాత్రి ఇరువురు డీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ముఠా మేస్త్రీ వెంకటేష్‌ (40) అక్కడిక్కడే మృతి చెందగా ఎస్కలేటర్‌ అపరేటర్‌ వివేకానందరెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. బల్లికురవ సంతమాగులూరు రోడ్డు వీర్ల కొండ క్వారీల సమీపంలో ముడి రాయి రవాణా చేసే ఒక లారీ మర్మత్తులకు గురై నిలిచి పోయింది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మోటార్‌ బైకు
ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్‌, తీవ్రంగా గాయపడిన వివేకానందరెడ్డి

ఒకరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

క్షతగాత్రుడిని తరలించేందుకు గంట వరకు రాని 108 వాహనం

బల్లికురవ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని వీర్ల కొండ గ్రానైట్‌ క్వారీల సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుండి బైకుపై వస్తున్న కార్మికులు శనివారం రాత్రి ఇరువురు డీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ముఠా మేస్త్రీ వెంకటేష్‌ (40) అక్కడిక్కడే మృతి చెందగా ఎస్కలేటర్‌ అపరేటర్‌ వివేకానందరెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. బల్లికురవ సంతమాగులూరు రోడ్డు వీర్ల కొండ క్వారీల సమీపంలో ముడి రాయి రవాణా చేసే ఒక లారీ మర్మత్తులకు గురై నిలిచి పోయింది. క్వారీలలో పనులు ముగిసిన తదుపరి బల్లికురవ వచ్చి తిరిగి వెళుతున్న ఇరువురు కార్మికుల బైకు కు లైట్‌ లేకపోవటంతో చీకట్లో లారీ కనిపించక వారు లారీని డీకొట్టారు. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన వెంకటేష్‌ అను ముఠా మేస్త్రీ సంఘటన స్ధలంలోనే మృతి చెందగా, అనంతపురంకు చెందిన క్రేన్‌ అపరేటర్‌ వివేకానందరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన క్షతగాత్రుడిని మార్టురు 108 వాహనంలో చి లకలూరిపేట వైద్యశాలకు తరలించారు. ఇరువురు కార్మికులు గత పదేళ్లగా బ్రతుకు దెరువుకు వచ్చి గ్రానైట్‌ క్వారీలలో పనులు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు.

108 వాహనం కోసం పడిగాపులు

క్వారీల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా మరోక కార్మికుడు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుండగా బాట సారులు రాత్రి 7 గంటల సమచంలో 108 వాహనం కోసం ఫోను చేయగా బల్లికురవ మండల కేంద్రంలో ఉన్న వాహనం అందుబాటులో లేదు అని సమాచారం వచ్చింది. మార్టురు నుండి 108 వాహనం 8 గంటలకు వచ్చింది. తీవ్ర గాయాల పాలైన కార్మికుడు గంట పాటు రోడ్డు మీదే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గాయాపడిన కార్మికుడు పరిస్దితి విషమంగా ఉందని సకాలంలో 108 వాహనం వచ్చి ఉంటే బాగుండేది అని ప్రజలు వాపోతున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:22 PM