Share News

క్రిస్మస్‌కు చర్చీల ముస్తాబు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:30 AM

క్రిస్మస్‌ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని చర్చీలు క్రిస్మస్‌ శోభతో విద్యుత్‌ దీపాలంకరణలతో ఆకట్టుకుంటు న్నాయి.

క్రిస్మస్‌కు చర్చీల ముస్తాబు

మార్కాపురంవన్‌టౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని చర్చీలు క్రిస్మస్‌ శోభతో విద్యుత్‌ దీపాలంకరణలతో ఆకట్టుకుంటు న్నాయి. పట్టణంలోని తెలుగు బాప్టిస్టు టౌన్‌చర్చి, లూథరన్‌ చర్చి, బాప్టిస్ట్‌ నగర్‌ చర్చి, సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చి, హలేలుయా చర్చి, రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఆర్‌సీఎం చర్చి తదితర చర్చిలతో పాటు పట్టణంలోని 70 చర్చీలను ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలు, క్రిస్మస్‌ స్టార్‌లతో చర్చిలను అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలకు సర్వంసిద్ధం చేశారు. ఆయా చర్చీలలో నిత్య ప్రార్థనలు, బైబిల్‌ పఠనాలు నిర్వహిస్తున్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : మార్కాపురం పట్టణంలోని పలు పాఠశాలలలో సెమీక్రిస్మస్‌ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వాసవి విద్యానికేతన్‌ లో ప్రిన్సిపాల్‌, డైరెక్టర్‌ రంగయ్య, ఏవో రంజిత్‌ కుమారుల ఆధ్వర్యంలో క్రిస్మస్‌ సంబరాలు నిర్వహిం చారు. విద్యార్థులు క్రీస్తుజననం, తదితర అంశాలు ప్రదర్శించారు. కమలా పాఠశాలలో చైర్మన్‌, కరస్పాం డెంట్‌ పెనుగొండ పవన్‌కుమార్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ సింధూజలు క్రిస్మస్‌ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భాష్యం పాఠశాలలో ప్రిన్సిపాల్‌ నాగరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. సాయిబాలాజీ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. జీఎంఆర్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ జి.మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యం లో కార్యక్రమాలు నిర్వహించారు.

దుస్తుల పంపిణీ

మార్కాపురం వన్‌టౌన్‌ : స్థానిక ఎన్‌ఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం పాస్టర్‌లకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ట్రస్ట్‌ అధ్యక్షులు నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళీల ఆధ్వర్యంలో 100 మంది పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ కార్యాలయం మేనేజర్‌ పూసల గాలెయ్య, షేక్‌ ఖమర్‌ తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు : రాచర్లలోని స్పందన విద్యాసంస్థల్లో సోమవారం సెమీక్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. బెంగుళూరుకు చెందిన ఐఎల్‌ఎం సంస్థ పర్య వేక్షణలో విద్యార్థులతో ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు అలరించాయి. క్రిస్మస్‌ పర్వదిన వేషధారణలు చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ పి.పరమేశ్వర్‌రెడ్డి, ఎండీ పి.సుధీర్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : క్రిస్మస్‌ సందర్భంగా మండలవ్యాప్తంగా చర్చీలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో ప్ర త్యేకంగా ఆలకరించారు. పట్టణం లోని పవిత్ర అపోస్తలుల దేవాలయం, లుథరన్‌ బాప్టిస్టు చర్చిలలో మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక పార్ధనలు నిర్వహించనున్నట్లు నిర్వాహ కులు సోమరవారం తెలిపారు. అంబేడ్కర్‌నగర్‌, ఇజ్రాయిల్‌పేట, ఇందిరా నగర్‌ కాలనీతో పాటు పలు కాలనీల వద్ద స్టాల్స్‌ను ఆందంగా ముస్తాబు చేసి ఏర్పాటు చేశారు.

సెమీ క్రిస్మస్‌ వేడుకలు

కంభం : కంభం మండలం యర్రబాలెం గ్రామంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి గోన చెన్న కేశవులు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. పేదలకు అన్నదానం చేయడమే కాకుండా మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, జడ్‌పిటిసి కొత్తపల్లి శ్రీనివాసులు, తోట శ్రీనివాసులు, కటికెల భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:30 AM