ఇసుక సీనరేజ్ రద్దు
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:21 PM
ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం సీనరేజ్, డీఎంఎఫ్, మెరిట్ రుసుమును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.
ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇసుక డిపోలు ఏర్పాటు
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం సీనరేజ్, డీఎంఎఫ్, మెరిట్ రుసుమును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిటైల్/సాధారణ వినియోగదారులు ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు జిల్లాలో రీచ్‌లు లేనందున సరిహద్దు జిల్లాల్లో నుంచి ప్రభుత్వం నిర్ణయించిన లోడింగ్ చార్జీలు చెల్లించి అవసరమైన పరిమాణంలో తెచ్చుకోవచ్చని తెలిపారు. చిన్నతరహా ఇసుక వినియోగదారుల కోసం జిల్లాలో ఇసుక డిపోలను ప్రైవేటు వ్యక్తులు/ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి, దర్శిలలో ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఈ ఏజెన్సీల ద్వారా విక్రయాలు చేపడతాని తెలిపారు. ఇసుక స్టాక్‌యార్టులు ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీలు ఈనెల 12వతేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వాటిని ఈనెల 14వతేదీ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమక్షంలో పరిశీలించి ఎంపిక చేస్తామని తెలిపారు.