Share News

ఆవులు, లేగదూడల సామూహిక వధ చేస్తే చర్యలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:30 AM

ఈనెల 17వ తేదీన బక్రీదు పండుగ సం దర్భంగా జిల్లాలో ఆవులు, లేగదూడల సామూహిక వధ జరిగితే అటువంటి వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ అఽధికారి డాక్టర్‌ కె.బేబీరాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆవులు, లేగదూడల సామూహిక వధ చేస్తే చర్యలు

జిల్లా పశుసంవర్థకశాఖ అఽధికారి బేబీరాణి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 13 : ఈనెల 17వ తేదీన బక్రీదు పండుగ సం దర్భంగా జిల్లాలో ఆవులు, లేగదూడల సామూహిక వధ జరిగితే అటువంటి వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ అఽధికారి డాక్టర్‌ కె.బేబీరాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఆవులు, లేగదూడ లను వధించటం జంతు హింస నివారణ చట్టం 1960, ఆంధ్రప్రదేశ్‌ గోవధ నిరో ధక చట్టం 1977, పశువుల రవాణా నియామవళి 1978, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన వివిధ రకాల ఉత్తర్వులు ప్రకారం చట్ట విరుద్ధమన్నారు. జిల్లాలో ఇలాంటి చర్యలకు ఉపక్రమించినా, సహకరించిన వారందరూ శిక్షార్హులని పేర్కొన్నారు. అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరూ సామూహిక వధ కోసం పశువుల ను అమ్మకూడదని, వాటి రవాణాలో పాలు పంచుకోవద్దని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Jun 14 , 2024 | 12:30 AM