Share News

తీరుమారకపోతే అధికారులపై చర్యలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:35 AM

అధికారుల తీరుమార్చుకోకపోతే శాశ్వతంగా సెలవు తీసుకుని ఇంటివద్ద ఉండాల్సి వస్తుందని ఎమ్మెల్యే కందుల నారయణరెడ్డి మండిపడ్డారు.

తీరుమారకపోతే అధికారులపై చర్యలు

పొదిలి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అధికారుల తీరుమార్చుకోకపోతే శాశ్వతంగా సెలవు తీసుకుని ఇంటివద్ద ఉండాల్సి వస్తుందని ఎమ్మెల్యే కందుల నారయణరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అన్నవరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కొత్తపులి శివారెడ్డి ఇచ్చిన భూసమస్యకు సంబంధించిన అర్జీని వీఆర్‌వో సామ్యేల్‌ తీసుకోలేదని పొదిలి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కందుల దృష్టికి తీసుకొచ్చారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే వీఆర్‌వోను పిలి పించి రైతు ఇచ్చిన అర్జీని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం భూసమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తు న్నట్లు తెలియదా..? అని వీఆర్‌వోను ప్రశ్నించారు. అధికారులు ఇంకా వైసీపీ పాలనలోని జ్ఞాపకా లలో ఉన్నారని ఇదే కొనసాగితే తీవ్ర ఇబ్బందు లకు గురవుతారని హెచ్చరించారు.

ప్రజలను మభ్యపెట్టేందుకే వెలిగొండ డ్రామా

కొనకనమిట్ల : పశ్చిమప్రాంతంలోని ప్రజలను మభ్యపెట్టేందుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని సిద్ధవరం గ్రామంలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తికాకుండానే జాతికి అంకితం చేస్తున్నానంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు.

తర్లుపాడు : భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని విజయభాస్కర్‌ అన్నారు. మండలంలోని జంగంరెడ్డిపల్లెలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూసమస్యలపై అర్జీలను తహసీల్దార్‌కు అందజేశారు. మొత్తం 23 అర్జీలు భూ సమస్యలపై వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, గతంలో రీసర్వే జరగడంతో ఒకరి భూములు మరొకరికి పట్టాదారు పాసుపుస్తకం కంటే ఎక్కువ, తక్కువ తప్పుల తడకగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలకు 45 రోజుల్లోపు పరిష్కరిస్తారన్నారు. కార్య క్రమంలో సర్వేయర్‌ సురేష్‌, వీఆర్‌వోలు, ఈవోఆర్డీ సుకుమార్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:35 AM