Share News

ఇచ్చిన హామీలన్నీ అమలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:03 AM

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒ క్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి అన్నారు. పింఛన్ల పెంపుపై మాటతప్పి వృద్ధులను కూడా మోసం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అని ధ్వజ మెత్తారు.

ఇచ్చిన హామీలన్నీ అమలు

పింఛన్‌ సొమ్మును పెంచి ఒకటో తేదీనే ఇస్తున్నాం

మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా త్వరలో సబ్సిడీ రుణాలు

మంత్రి డాక్టర్‌ స్వామి

వృద్ధులనూ మోసం చేసిన ఘనుడు జగన్‌ అంటూ ధ్వజం

టంగుటూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒ క్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి అన్నారు. పింఛన్ల పెంపుపై మాటతప్పి వృద్ధులను కూడా మోసం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అని ధ్వజ మెత్తారు. తాము ఆయనలాగా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. మం డలంలోని కారుమంచిలో శుక్రవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ ద్వారా జగన్‌కు సూపర్‌ స్ట్రోక్‌ ఇస్తామన్నారు. మాది మంచి ప్రభుత్వమని, వైసీపీది ప్రజలను ముంచిన ప్రభుత్వమని విమర్శించారు. పింఛ న్ల పెంపుపై మాట తప్పిన జగన్‌కి సొంత తల్లి, చెల్లిని మోసం చేయడం ఒక లెక్కా అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తు న్నామని చెప్పారు. దీపం పథకం కింద రాష్ట్రం లో 1.48 కోట్ల మంది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామన్నారు. గుంతలు లేని రోడ్లు అనే కార్యక్రమాన్ని శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు స్వామి చెప్పారు. దీనికోసం రూ.800 కోట్లు మంజూరు చేశామ న్నారు. సొంత వాహనం కలిగిన ప్రతి ఒక్కరికీ వారి గృహ నిర్మాణ అవసరాలకు ఉచితంగా ఇ సుకను ఇస్తున్నామని తెలిపారు. సొంత వాహ నం లేని వారికి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధికంగా వ సూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఎస్సీ కా ర్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మంత్రి విమ ర్శించారు. వచ్చే నెలలో 50వేల సబ్సిడీతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన వారికి రుణాలు మ ంజూరు చేస్తామని తెలిపారు. కొండపి నియో జకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు కృష్ణా జ లాలు అందించేందుకు రూ.450 కోట్లతో ప్రతిపా దనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామ న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.ఆంజనే యులు, ఎంపీడీవో దేవసేనకుమారి, టీడీపీ మ ండల అధ్యక్షుడు విజయకుమార్‌, మేడికొండ ర వీంద్ర, ఈదర ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:03 AM