Share News

నాగులచెరువు ఆధునికీకరణకు శ్రీకారం

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:20 AM

కనిగిరిలో దశాబ్దకాలంగా నాగులచెరువు కబ్జా, ఆక్రమణలతో చుక్కనీరు రాక నిరుపయోగంగా మారింది. ఈక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కనిగిరి ప్రాంతంలో ఏర్పాటవుతున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి మట్టి అవసరమై ఉంది. దీంతో ఆయా పనులను కాంట్రాక్టు పొందిన సంస్థ నాగులచెరువు నుంచి మట్టిని తోలుకునేందుకు కోరింది.

నాగులచెరువు ఆధునికీకరణకు శ్రీకారం
నాగులచెరువు ఆధునీకరణకు జరుగుతున్న పనులు

కనిగిరి, అక్టోబరు 3: కనిగిరిలో దశాబ్దకాలంగా నాగులచెరువు కబ్జా, ఆక్రమణలతో చుక్కనీరు రాక నిరుపయోగంగా మారింది. ఈక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కనిగిరి ప్రాంతంలో ఏర్పాటవుతున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి మట్టి అవసరమై ఉంది. దీంతో ఆయా పనులను కాంట్రాక్టు పొందిన సంస్థ నాగులచెరువు నుంచి మట్టిని తోలుకునేందుకు కోరింది. దీంతో ఎమ్మెల్యే నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్‌లతో నాగులచెరువును పూడికతీత పనులు, గోతులు లేకుండా, జంగిల్‌ క్రియరెన్స్‌ పనులు చేపట్టి ఆయా చెరువులో మట్టిని తోలుకుని ట్యాంకు మాదిరిగా చేయాలని సూచించారు. చెరువులో ఆక్రమణలను తొలగించి వాగు, వంకల నుంచి గతంలో మాదిరిగి నీరు చేరేలా కాలువ పనులు చేపట్టాలని కోరారు. అందుకు ఒప్పుకున్న నిర్మాణ సంస్థ నిర్వాహకులు ఆగమేఘాలపై నాగులచెరువు ఆధునికీకరణ పనులను గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలంగా కనిగిరి పట్టణ పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి ఇంటి మోటర్లు నిరుపయోగంగా మారాయి. నాగులచెరువు ఆధునికీకరణ పనులు పూర్తయి చెరువులోకి వర్షపు నీరు చేరితో భూగర్భజలాలు పెంపొందే అవకాశం ఉంది.

Updated Date - Oct 04 , 2024 | 12:20 AM