కొమ్మమూరు కాలువకు జలకళ
ABN , Publish Date - Sep 23 , 2024 | 11:21 PM
కొమ్మమూరు కాలువలో నీరులేక వేల ఎకరాల్లో సాగుచేసుకున్న వరిని సాగు చేసుకున్న రైతులు కళ్లముందు పైర్లు ఎండిపోతుంటే వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. నీటిని విడుదల చేసి ఫైర్లను కాపాడాలంటూ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు కాలువకు పడిన గండ్ల మరమత్తులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నీటి విడుదలకు జాప్యం వాటిల్లింది.
కారంచేడు కాలువ వద్ద ఆరు అడుగులు ఉన్న నీటి మట్టం
ఎమ్మెల్యే ఏలూరి చొవర, మంత్రి నిమ్మల ఆదేశాలతో నీటి విడుదల
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
కారంచేడు(పర్చూరు), సెప్టెంబరు 23 : కొమ్మమూరు కాలువలో నీరులేక వేల ఎకరాల్లో సాగుచేసుకున్న వరిని సాగు చేసుకున్న రైతులు కళ్లముందు పైర్లు ఎండిపోతుంటే వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. నీటిని విడుదల చేసి ఫైర్లను కాపాడాలంటూ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు కాలువకు పడిన గండ్ల మరమత్తులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నీటి విడుదలకు జాప్యం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కాలువలో అరకొర ఉన్న నీటిని ఇంజన్‌ల ద్వారా నారు మళ్ళకు అందించేందుకు సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. నియోజకవర్గంలో దాదాపు 90వేల ఎకరాలకు వరకు కొమ్మమూరు కాలువపైనే రైతులు ఆదారపడి సాగుచేసుకుంటున్నారు. ఈ కాలువల ద్వారానే పంటపొలాలకు సాగునీరు. ఇప్పటికే వేల ఎరరాల్లో వరిని సాగుచేసుకున్న రైతులు పంటలు పైర్లు ఎండుముఖం పట్డడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి
సాగునీరు లేక వేల ఎకరాల్లో వరి, నారు మడులు ఎండిపోతున్న విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను నీటి పారుదల మంత్రి నిమ్మల రామారావు దృష్టికి తీసుకుపోయి నీటిని విడుదల చేయించేలా చర్యలు చేపట్టారు. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి కొమ్మమూరు కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కారంచేడు వద్ద కొమ్మమూరు కాలువలో నీటి మట్టం 6 అడుగులకు చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
పైర్లకు జీవం పోసినట్లయింది
కళ్ల మందు నారు మళ్లు ఎండిపోతుంటే తీవ్ర ఆవేదన చెందాం. కొమ్మమూరు కాలుకు నీటిని విడుదల చేయడం తో పైర్లకు ప్రాణం పోసినట్లయింది. సాగునీటి విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషిని మరువలేం. గత వైసీపీ పాలనలో సాగునీరు అందక వేల ఎకరాల్లో చేతికి అందివచ్చిన పంటను కోల్పోయాం.
- యార్లగడ్డ జోగయ్య, కారంచేడు
నీటి మట్టం తగ్గకుండా చూడాలి
అధికారులు ప్రత్యేక పర్యవేణలో నీటి మట్టం తగ్గకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండిపోతున్న పైర్లు, రైతులు పడుతున్న అవస్థలపై ప్రభుత్వం చూపిన చొరవ మరువలేం. నీరులేక నారు మళ్లు ఎండిపోతుంటే తీవ్ర కలత చెందాం.
- వై.పాపయ్య, కారంచేడు