అశోక్‌బాబు ఆరోపణలు అవాస్తవం
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:48 AM
డాక్టర్ యాదల అశోక్‌బాబు తనపై, మా జీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్ర ణీత్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చి న్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి తెలిపా రు.
ఎంపీపీ అంకమ్మరెడ్డి వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 30 (ఆంధ్ర జ్యోతి): డాక్టర్ యాదల అశోక్‌బాబు తనపై, మా జీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్ర ణీత్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చి న్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి తెలిపా రు. శనివారం ఒంగోలులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదల అశోక్‌బాబుకు తనకు మధ్య వ్యాపార సంబంధమైన లావాదేవీలు తప్ప మరేమీ లేవ న్నారు. అశోక్‌బాబు, తాను కలిసి రూ.25లక్షలతో ఇసుక భూమి కొన్నామని తెలిపారు. దాని తా లూకు ఆయన రూ.18 లక్షలు ఇచ్చారని చెప్పా రు. కొన్ని రోజుల తర్వాత తిరిగి డబ్బులు ఇవ్వా లని కోరడంతో రూ.10లక్షలు ఇచ్చినట్లు పేర్కొ న్నారు. ఇందుకు సంబంధించి తమ మధ్య అగ్రి మెంట్ కాగితాలు ఉన్నాయన్నారు. అయితే అ శోక్‌బాబు వద్ద ఎమ్మెల్యే టికెట్ ప్రస్తావన, రా జకీయ అంశాలపై ఎలాంటి సంభాషణ జరగలే దని ఆయన తెలిపారు. అందులో ప్రణీత్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌కు డబ్బులు ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు. దీనిని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఇద్దరం కూర్చుని చ ర్చించుకొని పరిష్కరించుకోవాలే తప్ప ఇలా త ప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటి కైనా పెట్టిన కేసు, చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని అంకమ్మరెడ్డి హెచ్చరించారు.