Share News

కనిగిరి అభివృద్ధిలో అధికారులు చొరవ చూపాలి

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:55 PM

కనిగిరి అభివృద్ధిలో అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం చైర్మన్‌ గఫార్‌ అధ్యతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడా రు. కనిగిరిలో జరిగిన, జరగనున్న ఆక్రమణల తొలగింపు లో తమ ప్రమేయం లేదన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆర్డినెన్స్‌ ఎన్నికలు రావటంతో నిలిచిందన్నారు.

కనిగిరి అభివృద్ధిలో అధికారులు చొరవ చూపాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కనిగిరి అభివృద్ధిలో అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం చైర్మన్‌ గఫార్‌ అధ్యతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడా రు. కనిగిరిలో జరిగిన, జరగనున్న ఆక్రమణల తొలగింపు లో తమ ప్రమేయం లేదన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆర్డినెన్స్‌ ఎన్నికలు రావటంతో నిలిచిందన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఏరియాల్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ప్రజాసంక్షేమంలో వారి సూచనలతోనే తాము ముందుకు వెళ్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్య శాశ్వత పరి ష్కారానికి బైపాస్‌ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్ఠు కల్లా పూర్తి చేసేవిధంగా వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. కోఆప్షన్‌ సభ్యుడు చింతం శ్రీనివా సులుయాదవ్‌ మాట్లాడుతూ పట్టణంలోని చెప్పులబజారు, ప్రభుత్వాసుపత్రి వద్ద, వివిధ రోడ్డులోని ఫుట్‌పాత్‌ వ్యాపా రుల బంకులు తొలగించారన్నారు. వారికి జీవనోపాధి కలిగేలా నిబంధనలకు అనుగుణంగా అవకాశం ఇవ్వాలని కోరారు. గత పాలకులు ఇచ్చిన హామీల్లో దొరువు అభివృద్ధి హామీగానే మిగిలిపోయిందన్నారు.

దొరువు అభివృద్ధి నిధులు ఏమయ్యాయి

కోఅప్షన్‌ సభ్యుడు లేవనెత్తిన దొరువు అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సుదీర్ఘ చర్చ చేశారు. దొరువు అభివృద్ధికి వినియోగించిన నిధులు, అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోవటానికి గల కారణాలు, తిరిగి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నివేదిక, ప్రణాళిక అందజేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ దానియేలు, అధికారులను ఆదేశించారు. అనంతరం ప్లాస్టిక్‌ డస్ట్‌బిన్స్‌లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరి మున్సిపాల్టీ రూట్‌ మ్యాప్‌, బ్లూప్రింట్‌ తప్పనిసరిగా తయారు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జోసఫ్‌ దానియేలు, మేనేజర్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ ప్రదీప్‌, టీపీవో సువర్ణకుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:55 PM