Share News

5న జొన్నవిత్తులకు పురస్కారం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:55 PM

తెలుగు వేదకవి, సీనీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మ మ్మ సాహిత్య పురస్కారం 2025ను ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు అద్దంకిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.

5న జొన్నవిత్తులకు పురస్కారం
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీ ప్రతినిధులు

అద్దంకి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : తెలుగు వేదకవి, సీనీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మ మ్మ సాహిత్య పురస్కారం 2025ను ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు అద్దంకిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన వ్యాస మం జూష పుస్తకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆవిష్కరించనున్నారు. ఇం దుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం అద్దంకిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్‌ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచం ద్రమూర్తి మాట్లాడుతూ తెలుగుబాషా వ్యాప్తి కోసం అవి శ్రాంతంగా కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞావంతుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు పురస్కారాన్ని ప్రదానం చేయడం గర్వకారణమన్నారు. కార్య క్రమంలో డాక్టర్‌ యూ దేవపాలన, నారాయణం బాలసుబ్రహ్మణ్యం, డీవీఎం సత్యనారాయణ, వారణాసి రఘురామశర్మ, నిమ్మరాజు నాగేశ్వరరావు, చిన్ని మురళీకృష్ణ, చప్పిడి వీరయ్య, చుండూరి మురళీసుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:55 PM