Share News

ఓటుహక్కుపై అవగాహన

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:03 AM

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వైకేపీ ఏపీఎం రమేష్‌బాబు అన్నారు.

ఓటుహక్కుపై అవగాహన

మార్కాపురం రూరల్‌, మార్చి 27 : ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వైకేపీ ఏపీఎం రమేష్‌బాబు అన్నారు. పట్టణంలోని ఎస్వీబీసీ కాలనీలోని వైకేపీ కార్యాలయం వద్ద ఓ

టుహక్కుపై గ్రామంలోని మహిళలు అవగాహన, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రాంతంలో మహిళలతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీసీలు మనోకుమారి, స్వామి, అకౌంటెంట్‌, వీవోఏలు, స్వయంసహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.

గిద్దలూరు : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధ నలను తప్పకుండా పాటించాలని గిద్దలూరు రూరల్‌ సీఐ దాసరి ప్రసాద్‌ సూచించారు. రాచర్ల పోలీసుస్టేషన్‌లో ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, వ్యక్తిగత ప్రచారాలు, ఇంటింటి ప్రచారాలు చేయాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సహకరించాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పొదిలి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికలకోడ్‌ ఉల్లంగిస్తే చట్టపర మైనచర్యలు తప్పవని సీఐ మల్లికార్జునరావు హెచ్చరిం చారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలకోడ్‌ అమలులో ఉందని ప్రతిరోజు గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా వాట్స్‌అప్‌లలో వచ్చే సందేశాలను ప్రజలు పూర్తిగా చదివిన తరువాత ఇబ్బం దులు తలెత్తవు అనుకుంటేనే పోస్ట్‌ చేయాలన్నారు. అర్థం తెలియకుండా పోస్ట్‌ చేసి వివాదాలకు కారణం కాకూడద న్నారు. రాజకీయంగా వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, పోస్ట్‌లు పెట్టడం చేయకూడదన్నారు. అలా చేయడాన్ని నేరంగా పరిగణిస్తామన్నారు. రౌడీషీటర్లతో పాటు గత ఎన్నికల్లో ఘర్షణలకు కారణమైన వారిని కూడా బైండోవర్‌ చేస్తామన్నారు. సమస్యాత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టిపెట్టి ఇరువర్గాల వారికి కొన్ని సూచనలు చేశామన్నారు. గ్రామా ల్లో ఏమైౖనా ఘటనలు జరిగినా, సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ఎవరి ఓటు వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కోటయ్య ఉన్నారు.

పెద్దదోర్నాల : ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని డీటీడబ్ల్యువో జగన్నాథ రావు అన్నారు. మండలంలోని చింతల, మర్రిపా లెం గిరిజన గ్రామాల్లో ఓటుహక్కుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన అవగాహన సదస్సులో భాగంగా డీటీడబ్ల్యువో జగన్నాథరావు మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలన్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలన్నారు. అయితే ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. అనంతరం స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు వినియోగించు కుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ డైరక్టర్‌ ధనుంజయ, జిల్లా లేబర్‌ అధికారి భూపాల్‌, నోడల్‌ అధికారి శ్రీనివాసరావు, ఎంఈవో కొండలరావు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కోఆర్డినేటర్‌ మంతన్న, టీఏ లాల్‌ అహ్మద్‌ హెచ్‌ఎం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌పై అవగాహన

త్రిపురాంతకం : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌పై అవగాహనా కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ బి.రామకృష్ణ శివప్రసాద్‌, ఎంపీడీవో ఎం.సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, గ్రామాల్లో అన్ని రకాల పరిస్థితులపై ప్రతి ఒక్క అధికారీ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయపార్టీల ప్రచారాల్లో సౌండ్‌ బాక్సులు వినియోగించకూడదని, ర్యాలీలు చేయాలంటే అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ప్లెక్సీలు, జండాలు ఉండకూడదని తెలిపారు. ఎస్సై సాంబశివయ్య మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కవ్వింపు చర్యలకు పాల్పడే వారిపై దృష్ఠి సారించాలని సిబ్బందికి మహిళా పోలీసులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఎన్‌.మురళీమోహన్‌, ఎంఈవో రాజశేఖరరెడ్డి, వీఆర్వోలు, పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 02:04 AM