Share News

నకిలీ డాక్యుమెంట్స్‌తో బ్యాంకు రుణం

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:26 PM

గతంలో నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి రూ.3లక్షలు బ్యాంకు రుణం పొందాడు. అంతటితో ఆగని ఆతను మరో మహిళ పేరున తాజాగా అవే నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి బ్యాంకులో పెట్టి రుణం పొందేందుకు ప్రయత్నించాడు

నకిలీ డాక్యుమెంట్స్‌తో బ్యాంకు రుణం

పవర్‌ పట్టా ఉన్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

టంగుటూరు, అక్టోబరు 1 : గతంలో నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి రూ.3లక్షలు బ్యాంకు రుణం పొందాడు. అంతటితో ఆగని ఆతను మరో మహిళ పేరున తాజాగా అవే నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి బ్యాంకులో పెట్టి రుణం పొందేందుకు ప్రయత్నించాడు. అంతలో అసలు విషయం బయట పడింది. డాక్యుమెంట్స్‌ అన్నీ నకిలీవని, అసలు ఆ భూమి యజమాని అమెరికాలో నివాసం ఉంటాడని తేలింది. దీంతో అమెరికాలో ఉన్న భూయజమాని ఆ భూమి తాలూకా, పవర్‌ పట్టా రాసిచ్చిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే... మండలంలోని జమ్ముపాలెంలో నివాసం ఉండే ఓ వ్యక్తి గ్రామానికే చెంది అమెరికాలో ఉంటున్న వ్యక్తికి చెందిన భూమి కాజేసేందుకు ప్లాన్‌ వేశాడు. సుమారు 6.5 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి జాతీయ బ్యాంకులో పెట్టి 2022లో రూ.3లక్షలు రుణం తీసుకున్నాడు. తిరిగి ఆ భూమి మీద మరో నకలి డాక్యుమెంట్స్‌ను అదే గ్రామానికి చెందిన మహిళ పేరున సృష్టించి బ్యాంకులో పెద్ద మొత్తంలో రుణం తీసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై బ్యాంక్‌ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఆ భూమి ఆమెది కాదని తేలింది. దీంతో పవర్‌ పట్టా కలిగిన వ్యక్తి ఈ విషయం తెలుసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా సదరు పవర్‌ పట్టా హుక్కు కలిగిన వ్యక్తి నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ఉన్నతాధికారులసలహాతో ముందుకెళ్తామని చెప్పారు.

Updated Date - Oct 01 , 2024 | 11:26 PM