Share News

మెరుగైన వైద్యసేవలను అందించాలి

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:52 AM

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ తమీ మ్‌ అన్సారియా ఆదేశించారు. శనివారం కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

మెరుగైన వైద్యసేవలను అందించాలి

కలెక్టర్‌ అన్సారియా

కొత్తపట్నం(ఒంగోలు నగరం) నవంబరు 9(ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ తమీ మ్‌ అన్సారియా ఆదేశించారు. శనివారం కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసు పత్రిలోని రికార్డులను పరిశీలించారు. రోగులతో మా ట్లాడారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. అ నంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. ప్రతి నె లా కాన్పుల కోసం వచ్చే గర్బిణుల వివరాలు, వారి కి వాడుతున్న మందులను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. హైరిస్కు ప్రెగ్నెన్సీ విష యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. గర్బిణులకు వైద్యాధికారులే బీపీని చెక్‌ చేయాలన్నారు. ఆసుపత్రిలో అందించే వైద్యసేవల గురించి బోర్డు ఏర్పాటు చేసి అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబోరేటరీ, కాన్సుల గది, ఆఫీసు గదులను పరి శీలించారు. హాజరు పట్టీలో సంతకం చేసిన సిబ్బం ది అందరూ ఉన్నారా అనే దిశగా పరిశీలన చేశారు. సిబ్బంది విధులకు సంబంధించిన రికార్డుల నిర్వహ ణ గురించి తెలుసుకుని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో రికార్డుల ని ర్వహణకు సంబంధించి ఏకరూపత ఉండాలని డీ ఎంహెచ్‌వో సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ కా ర్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ సూరిబాబు, తహసీల్దార్‌ మధుసూదనరావు, వైద్యాధికారులు శివపార్వతి, న వ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:52 AM