గ్రామాలలో మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:15 AM
గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు పేద మధ్యతరగతి కుటుంబాలలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన 15 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఒక హెల్పర్‌కు నియామకపత్రాలను ఎమ్మెల్యే ఏలూరి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల లో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చే యాల్సిన బాధ్యత అంగన్వాడీలపైనే ఉందన్నారు.
ఎమ్మెల్యే ఏలూరి
16 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక పత్రాల అందజేత
మార్టూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు పేద మధ్యతరగతి కుటుంబాలలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన 15 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఒక హెల్పర్‌కు నియామకపత్రాలను ఎమ్మెల్యే ఏలూరి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల లో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చే యాల్సిన బాధ్యత అంగన్వాడీలపైనే ఉందన్నారు. చిన్నారులకు ఆరోగ్యం, విద్యను అం దించే లక్ష్యంగా పనిచేయాలని ఏలూరి సూ చించారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టిక ఆహారాన్ని అందించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాలలో ఆహ్లాదకర వాతావరణం ఉం డేలా చూడాలన్నారు. గ్రామాల్లో చిన్నారు లంతా అంగన్‌వాడీలకు వచ్చేలా తల్లిదం డ్రులకు అవగాహన కల్పించేందుకు కార్యక ర్తలు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంతోపాటు కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. బాధ్యతతో పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఏలూరి ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడీపీవో సుభధ్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.