బాలిరెడ్డినగర్‌లో కార్డెన్ సెర్చ్
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:26 AM
మండలంలోని పాతసింగరాయకొండ పంచా యతీ పరిధిలోని బాలిరెడ్డినగర్‌లో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆకస్మి కంగా కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు.
పత్రాలులేని 31 బైక్‌లు, ఆటో స్వాధీనం
సింగరాయకొండ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యో తి): మండలంలోని పాతసింగరాయకొండ పంచా యతీ పరిధిలోని బాలిరెడ్డినగర్‌లో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆకస్మి కంగా కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరాయకొండకు దగ్గరగా ఉండే బాలిరెడ్డినగర్ వివిధ ప్రాంతాలకు చెందినవారు పనుల నిమిత్తం వచ్చి కాలనీలో స్థిరపడ్డారని తెలిపారు. ఇక్కడ గంజాయి, సరైన పత్రాలు లేని బైక్‌లు ఉన్నాయనే సమాచారంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు. సోదాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలులేని 31 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సరైన పత్రాలు చూ యిస్తే వాటిని తిరిగి ఇస్తామన్నారు. గంజాయిని పట్టుకోవడానికి డాగ్ స్వ్కాడ్‌ను కూడా వినియో గించామని ఎక్కడా గంజాయి పట్టుబడలేదని చె ప్పారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో సీఐ హజరత్తయ్య, ఎ స్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, మహేం ద, ఒంగోలు సబ్ డివిజన్‌లో ఎస్సైలు, 70 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.