Share News

క్రీస్తు శాంతి సందేశం అనుసరణీయం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:19 AM

క్రీస్తు శాంతి సందేశం అనుసర ణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఆఽధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

క్రీస్తు శాంతి సందేశం అనుసరణీయం
ఎమ్మెల్యే కొండయ్యను సన్మానిస్తున్న కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, ఇతర అధికారులు, సిబ్బంది

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : క్రీస్తు శాంతి సందేశం అనుసర ణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఆఽధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, జాలి, దయ గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్యాండిల్‌ సర్వీస్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, టీపీపీ శ్రీనివాసరావు, మాల్యాద్రి, పలువురు కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:19 AM