Share News

నడిమి వాగుపై కూలిన వంతెన

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:17 PM

నడిమి వాగుపై వంతెన కూలడం తో రాకపోకలు సాగించలేక ఆరికట్లవారిపా లెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కూలి ఏళ్లు గడుస్తున్నా పునర్‌ నిర్మాణానికి నోచుకోలేదని గ్రామ రైతులు, మహిళలు వాపోతున్నారు. మండలంలోని ఆరికట్లవారిపాలెం, చందలూరు గ్రామాల మధ్య కొన్నేళ్ల కిందట తుఫాన్‌తో తలెత్తిన వరద తాకిడికి నడిమి వాగుపై వంతెన కూలిపోయింది.

నడిమి వాగుపై కూలిన వంతెన
ఆరికట్లవారిపాలెం, చందలూరు గ్రామాల మధ్య నడిమి వాగుపై కూలిన వంతెన

పునర్‌ నిర్మాణానికి నోచుకోని వైనం

రాకపోకలకు ఇబ్బంది పడుతున్న రైతులు, కూలీలు

పంగులూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నడిమి వాగుపై వంతెన కూలడం తో రాకపోకలు సాగించలేక ఆరికట్లవారిపా లెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కూలి ఏళ్లు గడుస్తున్నా పునర్‌ నిర్మాణానికి నోచుకోలేదని గ్రామ రైతులు, మహిళలు వాపోతున్నారు. మండలంలోని ఆరికట్లవారిపాలెం, చందలూరు గ్రామాల మధ్య కొన్నేళ్ల కిందట తుఫాన్‌తో తలెత్తిన వరద తాకిడికి నడిమి వాగుపై వంతెన కూలిపోయింది. వంతెన కూలడంతో నడిమి వాగుకు అవతలి వైపు ఉన్న పొలాల్లో పంట సాగుకు ఆరికట్లవారిపాలెం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెన ఉన్న సమయంలో కూత వేటు దూరంలో పొలాలకు చేరుకునే రైతులు వంతెన కూలి వాగుకు పెద్ద గండి పడడంతో ఏడెనిమిది కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన పరి పరిస్థితి ఏర్పడింది. నిత్యం పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు వాగుపై వంతె కూలడంతో ఏర్పడిన గండిని దాటి పొలాలకు చేరుకోవడం నరక ప్రాయంగా ఉందని వాపోతున్నారు. చందలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వ్యవసాయ రుణాల కోసం రైతులు, కెనరా బ్యాంక్‌లో కార్యకలాపాల కోసం రాకపోకలు సాగించే పొదుపు సంఘాల మహిళలు చందలూరు చేరుకోవాలంటే పంగులూరు వైపుగా తిరిగి వెళ్లడానికి సరైన వసతి లేక యిబ్బంది పడుతున్నారు. నడిమి వాగుపై వంతెన పునర్‌ నిర్మించడంతో పాటు చందలూరు, ఆరికట్లవారిపాలెం గ్రామాల మధ్య చిల్ల కంప తొలగించి రోడ్డుకు తగిన మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:17 PM