Share News

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:18 AM

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు సిరిగిరి రంగారావు, ఈదర వెంకటసురే్‌షబాబు తెలిపారు. మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒంగోలులోని డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ ఇండోర్‌ స్టేడియంలో నవంబరు 24వ తేదీన జిల్లా జట్టుకు 18 మంది ప్రాపబుల్స్‌ని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు  ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక
జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు

చినగంజాం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు సిరిగిరి రంగారావు, ఈదర వెంకటసురే్‌షబాబు తెలిపారు. మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒంగోలులోని డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ ఇండోర్‌ స్టేడియంలో నవంబరు 24వ తేదీన జిల్లా జట్టుకు 18 మంది ప్రాపబుల్స్‌ని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. స్థానిక ఎంఎ్‌సఆర్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలో నవంబరు 26వ తేదీ నుంచి శుక్రవారం వరకు 18 మంది క్రిడాకారులకు కోచ్‌ మరపాల గిరిబాబు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో ప్రతిభ చూపిన 12 మంది క్రీడాకారులను జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు అవసరమైన భోజన సదుపాయాలు, ఇతర వసతులను ప్రకాశం జిల్లా చీఫ్‌ పెట్రాన్‌ డాక్టర్‌ నల్లూరి సుబ్బారావు కల్పించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సూదలగుంట ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే 71వ ఆంధ్ర రాష్ట్ర స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ వాలీబాల్‌, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు పోకూరి శేషయ్య, సీనియర్‌ కబడ్డీ క్రీడాకారుడు భోగిరెడ్డి రామాంజనేయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టు వివరాలుః పిట్టు బాలకృష్ణారెడ్డి(కెప్టెన్‌), కాయల వెంకటేష్‌, గాలి లక్ష్మారెడ్డి, గునిమిన సమరసింహారెడ్డి, ఆసోది సుబ్బారెడ్డి, గాలి రామకృష్ణ, పెళ్లేటి బ్రహ్మరెడ్డి, మంత్రు నాయక్‌, సోపర్ల మణి, గాలి లక్ష్మణ్‌, గొట్టు మలిఖార్జున్‌, కోట హరిప్రసాద్‌, కోచ్‌ ఎం.గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:18 AM