Share News

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:38 PM

ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమని, అందరం కలసికట్టుగా ప్రయాణం చేస్తూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిబాటలో నడిపిద్దామని ఎమ్మెల్యే ఎంఎం కొం డయ్య పిలుపునిచ్చారు.

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్యే కొండయ్యకు జ్ఞాపికను అందజేస్తున్న దేవాంగ సంక్షేమ సంఘం ప్రతనిధులు

ఎమ్మెల్యే కొండయ్య పిలుపు

చీరాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమని, అందరం కలసికట్టుగా ప్రయాణం చేస్తూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిబాటలో నడిపిద్దామని ఎమ్మెల్యే ఎంఎం కొం డయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని దేవాంగపురి శ్రీ చౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తృతీయ నూతన సంవత్సర క్యాలండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దేవాంగ సామాజికవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరస్పర సహకారంతో ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. నిర్వాహకులు ఎమ్మెల్యే కొండయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవాంగ ప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

శ్రీ కృష్ణ గోశాలలో

పాపరాజుతోట శ్రీ కృష్ణ గోశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమాలో ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆవిష్కరించారు. గోశాలకు తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో గోశాల ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:38 PM