Share News

అంబేడ్కర్‌ స్ఫూర్తితో చినగంజాం అభివృద్ధి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:36 PM

రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో చినగంజాం మండల అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని కడవకుదురు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దపూడి విజయ్‌కుమార్‌, బాపట్ల అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ సలగల రాజశేఖర్‌బాబుతో కలిసి ఆదివారం రాత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంబేడ్కర్‌ స్ఫూర్తితో చినగంజాం అభివృద్ధి

చినగంజాం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో చినగంజాం మండల అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని కడవకుదురు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దపూడి విజయ్‌కుమార్‌, బాపట్ల అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ సలగల రాజశేఖర్‌బాబుతో కలిసి ఆదివారం రాత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఏలూరి మాట్లాడుతూ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఫలాలను అందించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుందన్నారు. చినగంజాం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఓడల తయారీ పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి కృషికి చేస్తున్నట్లు తెలిపారు. మండలాన్ని టూరిజం హబ్‌గా, పరిశ్రమల హబ్‌గా రూపొందించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానాన్నరు. అనంతరం చర్చి ఆవరణలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేదుకల్లో ఎమ్మెల్యే ఏలూరి పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జె.ప్రభాకరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య, నాయకులు విక్రం వెంకటరావు, నక్కల వెంకటనారాయణ, ఎన్‌వీ రాఘవులు, వీరాస్వామి, డి.నాగరాజు, కత్తి లాజర్‌ మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:36 PM