గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతాం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:35 AM
గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలు, అందుకు తగిన అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. గురు వారం ఒంగోలు ఎంపీడీవో కార్యాలయంలో మం డల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లి కార్జునరెడ్డి అధ్యక్షతన జరిగింది.
సంబంధిత సమాచారం ఇప్పటికే సేకరించాం
మండల సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల వెల్లడి
ఒంగోలు(రూరల్), డిసెంబరు26 (ఆంధ్రజ్యో తి): గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలు, అందుకు తగిన అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. గురు వారం ఒంగోలు ఎంపీడీవో కార్యాలయంలో మం డల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లి కార్జునరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల మా ట్లాడుతూ గ్రామాలకు సంబంధించిన అన్ని రకా ల సమాచారం సేకరించామని చెప్పారు. మండ లంలో 7,472 కుంటుంబాల నుంచి సమాచారం సేకరించామని, ఇందులో 14,280 సమస్యలు గు ర్తించినట్లు ఎమ్మల్యే తెలిపారు. ఈక్రమంలో కరవ ది, యరజర్ల, ఉలిచి, చింతాయిగారిపాలెం గ్రామా ల్లో సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. 1,016మందికి సొంత స్థలాలు ఉన్నాయని, ఇందు లో కొత్తగా ఇళ్లు నిర్మించునేందుకు అనుమతి ఇ స్తామన్నారు. 322మందికి వైద్యపరమైన సమస్య లు ఉన్నాయని, ఇక 511మంది నిరుద్యోగులు ఉ న్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన రేషన్‌కా ర్డులు, పెన్షన్లు, నీటికుళాయిలు, నిరుద్యోగుల వివ రాలు, ఇతర సమస్యలను గుర్తించామని చెప్పా రు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందే లా చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకా శాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు సంక్రాంతి పండగ నాటికి పూర్తి చే యాలన్నారు. ఇక గ్రామాల్లో తాగునీటి సమస్య లు ఉన్నట్లు ప్రజలు ఫోన్ ద్వారా తెలుపుతున్నార ని వివరించారు.దశరాజుపల్లి గ్రామంలో గత 15 రోజులు నుంచి తాగునీటి సమస్య ఉందని, అధి కారులు అధికారులు తక్షణమే నీటి సరఫరా చే యాలని ఆదేశించారు. త్రోవగుంట వద్ద పైపులైన్ పగిలి పోవటంతో గ్రామాలకు నీటిసరఫరా ని లిచిపోయిందని, మరమ్మతులకు నిధులు మంజూ రు చేస్తామని తెలిపారు. ఏపీవో మాట్లాడుతూ నూతనంగా 11మంది ఉపాధి పథకం కింద క్షేత్ర సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో శేషుబాబు, ఈవోఆర్డీ ఎ.బాల చెన్నయ్య, మండల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.