Share News

రైతుల్లో కలవరం

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:25 AM

జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం రైతులను కలవరపెడు తోంది. దీనికితోడు రానున్న రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సంకేతాలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత పది రోజులుగా జిల్లాలో చలిగాలులు, మంచు తీవ్రత అధికంగా ఉంది.

రైతుల్లో కలవరం
కుచ్చుతెగులు సోకడంతో మిర్చి పంటలో ముడుచుకుపోయిన ఆకులు

మారుతున్న వాతావరణం

మళ్లీ జిల్లా అంతటా మంగుపట్టి.. పంటలపై తెగుళ్లు, పురుగుల ఉధృతి

రెండు, మూడు రోజులు వాన పడే అవకాశం

పంటలు దెబ్బతింటాయని రైతుల ఆందోళన

ఒంగోలు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం రైతులను కలవరపెడు తోంది. దీనికితోడు రానున్న రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సంకేతాలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత పది రోజులుగా జిల్లాలో చలిగాలులు, మంచు తీవ్రత అధికంగా ఉంది. అంతకుముందు వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో పంటలపై పురుగులు, తెగుళ్లు దాడి పెరిగింది. రెండు రోజులు కాస్తంత తెరపి ఇచ్చి ఎండ కనిపిం చినా తిరిగి మంగు వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఖరీఫ్‌లో వేసిన వరి కోతలు జరుగుతుండగా కంది పిందె దశలో ఉంది. పత్తి, మిర్చి కోతలు జరుగుతు న్నాయి. ఇక రబీలో వేసిన పొగాకు, వరి, శనగ, మినుము, అలసంద, ఇతరత్రా పైర్లు ఎదుగుదల దశలో ఉన్నాయి. మిర్చి తోటలపై వైరస్‌ దాడి అధికంగా ఉంది. ఇతర పంటల పరిస్థితి అదేవిధంగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో నెలకొన్న మంగు వాతావరణంతో పంటలపై చీడపీడల దాడి మరింత పెరిగి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. తున్నారు.


మళ్లీ వాన భయం

ఈనెల తొలివారంలో కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతా ల్లో పంటల సాగు జాప్యమైంది. కాగా అల్పపీడనాల ప్రభావంతో ఎప్పటికప్పుడు జిల్లాలో వర్షం పడేలా ఆకాశం మేఘావృతవుతోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి ఒక మోస్తరు వర్షాలు పడి పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం బలహీనపడినట్లే పడి తిరిగి దిశ మార్చుకొని వాయుగుండంగా మారి దక్షిణ, కోస్తా వైపు పయనిస్తుందని, మంగళవారం నుంచి గురువారం వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పు కనిపించింది. తుఫాన్‌ సమ యంలో ఉండే మాదిరి చలిగాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులతో వర్షాలు పడితే అన్నిరకాల పంటలు దెబ్బతినడంతోపాటు ఇంకా వేయాల్సిన వాటి సాగు మరింత ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన చెందు

Updated Date - Dec 24 , 2024 | 01:25 AM