పాస్టర్‌లకు దుస్తుల పంపిణీ
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:58 PM
క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్‌లకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. స్థానిక పీటీఎస్ కల్యాణ మండపంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 600 మంది పాస్టర్ దంపతులకు వస్త్రాలను పంపిణీ చేశారు.
పాస్టర్‌లకు దుస్తుల పంపిణీ
దర్శి, డిసెంబరు 23 : క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్‌లకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. స్థానిక పీటీఎస్ కల్యాణ మండపంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 600 మంది పాస్టర్ దంపతులకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ జీ స్టీవెన్, దొనకొండ, కురిచేడు, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, నెమలయ్య, కూరపాటి శ్రీనివాసరావు, ఓబులురెడ్డి, నియోజకవర్గానికి చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.
ఆందోళన వద్దు
భూ ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధైర్యం చెప్పారు. దర్శిలో ఆమె సోమవారం డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ వై.రామారావు, రెవెన్యూ అధికారులతో ఈ విషయమై చర్చించారు. జియోగ్రాఫిక్ రీసెర్చి అధికారులతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. భూ కంపాల తీవ్రత చాలా స్పల్పంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపినట్లు ఆమె వివరించారు. అంతకముందు ఆమె కలెక్టర్ అన్సారీయాతో మాట్లాడారు.