కబడ్డీ క్రీడాకారుల ప్రోత్సాహానికి కృషి
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:29 AM
రాష్ట్రంలో కబడ్డీ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని, అందుకోసం ప్రతి జిల్లాలో అసో షియోషన్ తరుపున పోటీలు నిర్వహిస్తామని కబ డ్డీ అసోషియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో పోటీలు నిర్వహిస్తాం
రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి
ఒంగోలు(రూరల్), నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కబడ్డీ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని, అందుకోసం ప్రతి జిల్లాలో అసో షియోషన్ తరుపున పోటీలు నిర్వహిస్తామని కబ డ్డీ అసోషియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని దక్షణ బైపా స్‌రోడ్డులోని గల ఆస్థాన ఫంక్షన్‌హాలులో జిల్లా పా లకవర్గ కబడ్డీ అసోషియోషన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో నూతన కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో కార్యవ ర్గాలను ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు అధికంగా ఉ న్నారని చెప్పారు. అందువల్ల క్రీడాకారులు పోటీల్లో ఎక్కువగా పాల్గొనాలని కోరారు. తిరుపతి, విశాఖ పట్నంలలో ఈ సంవత్సరం పోటీలు నిర్వహిస్తామ న్నారు. పారిశ్రామికవేత్త డాక్టర్ నల్లూరి సుబ్బారా వు మాట్లాడుతూ జిల్లాలో అసోషియోషన్ తరుపు న జరిగే కబడ్డీ పోటీలకు ప్రతి ఏడాది రూ.2లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జరిగే పోటీల కోసం రూ.2లక్షల నగదు అధ్యక్షుడు కుర్రా భాస్క రరావుకు అందజేశారు. అంతర్జాతీయ క్రీడాకారుడు అన్ను వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి కె.రామారావు వ్య వహరించారు. సీనియర్ అంతర్జాతీయ క్రీడాకారు డు నక్కా అర్జునరావు తదతరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా భాస్కరరావు
జిల్లా కబడ్డీ అసోషియోషన్ అధ్యక్షుడుగా కుర్రా భాస్కరరావును క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యా యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎన్. చంద్రమోహన్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్‌గా డాక్టర్ నల్లూరి సుబ్బారావు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్.రం గారావు, వైస్ ప్రెసిడెంట్‌లుగా కె.ప్రసాదురావు, ఈదర వెంకటసురేష్‌బాబు, ఎ.సుమతి, బి.దయా నంద్, ట్రెజరర్‌గా డి.రమేష్, కార్యదర్శిగా వై.పూర్ణచ ంద్రరావు, సీనియర్ జాయింట్ సెక్రటరీలుగా ఎం. హరనాథ్‌బాబు, పి.బసవయ్య, పి.హజరత్తయ్య, ఇ జ్రాయిల్, అలాగే ఈసీ సభ్యులుగా బి.అంకబాబు, కె.శ్రీలక్ష్మి, వై.చెన్నయ్య, ఎం.వీరాస్వామి, ఎండీ.హజీ రాబేగం, ఎస్.శివసిసింద్రి, టి.బాలాంజనేయులు, వై. బాలగురవయ్య, పి.దామోదరరెడ్డి, ఎ.రవికిరణ్, వై.బాబు, కె.మల్లికారాణి, ఎం.మోహనరావు, బంగా రురెడ్డిలను ఎన్నుకున్నారు.