ఉపాధి లక్ష్యాలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 02:02 AM
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉపాధి పథకం ద్వారా చేపట్టిన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్, సేద్యపు నీటి కుంటల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనులపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి వచ్చేనెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వత పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు.
కేసులపై సమీక్ష
వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను కలెక్టర్ సమీక్షిస్తూ ఎటు వంటి జాప్యం లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ధిక్కార, రిట్ పిటిషన్లపై ఆయాశాఖల వారీగా సమీక్షించి న్యాయం చేయాలని కోరారు. బ్యాంకులో జరిగిన అవినీతిలో పాలకవర్గాలే కాకుండా అందులో పనిచేసే అనేకమంది ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆమె కలెక్టర్‌కు చెప్పారు.
సమగ్ర విచారణ చేయాలి
గతేడాది సెప్టెంబరు, ఈ ఏడాది ఫిబ్రవరి నెలల్లో పీడీసీసీ బ్యాంకులో ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ మహబూబ్ సుభాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియారిటీ జాబితాలో తనకన్నా జూనియర్స్ దగ్గర లంచాలు తీసుకొని తనకు అన్యాయం చేశారన్నారు. బ్యాంకులో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు బ్యాంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.