Share News

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్ల ఏర్పాటు

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:07 AM

పేదల ఆకలి తీర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నక్యాంటీన్‌ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్ల ఏర్పాటు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 19 : పేదల ఆకలి తీర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నక్యాంటీన్‌ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురు వారం రాత్రి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యా లయం ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్‌ పరిసరాలను పరి శీలించి పలువురికి అన్నం వడ్డించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రూ.5లకే పేదలు కడుపునిండా భోజనం చేసేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా టిఫిన్‌, భోజనం చేసినా రూ.15తో కడుపు నిండుతుం దని అన్నారు. 2014-2019 కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టింద న్నారు. అనంతరం వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2వ విడతలో 75 అన్నాక్యాంటీన్లను సాయంత్రం ప్రారంభిం చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదట విడత 100, రెండవ విడతలో 75 క్యాంటీన్లు ప్రారంభించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రైతుసంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌ యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాస్‌, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, టీడీపీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు షానేషావలి, మార్తాల సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు పిడతల రమేష్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పట్టణంలోని గణేష్‌నగర్‌లో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, దప్పిలి కాశిరెడ్డి, పందిళ్ళపల్లి శ్రీనివాసులు, గోపాల్‌రెడ్డి, మద్దులేటి, రామయ్య, మహేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:07 AM