దేవుని ఆస్తుల పరిరక్షణకు అందరూ సహకరించాలి
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:27 PM
దేవస్థాన ఆస్తుల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించి చేయూత ఇవ్వాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. పామూరు నడిబొడ్డున ఉన్న శ్రీవల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 11 సెంట్ల స్థలంలో నిర్మించిన దుకాణాలకు సక్రమంగా అద్దెలు చెల్లించకుండా ఇబ్బందులు పె డుతుండటంతో గత నెల 24న ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆ షాపులను సీజ్ చేశారు.
పామూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : దేవస్థాన ఆస్తుల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించి చేయూత ఇవ్వాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. పామూరు నడిబొడ్డున ఉన్న శ్రీవల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 11 సెంట్ల స్థలంలో నిర్మించిన దుకాణాలకు సక్రమంగా అద్దెలు చెల్లించకుండా ఇబ్బందులు పె డుతుండటంతో గత నెల 24న ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆ షాపులను సీజ్ చేశారు. పామూరు టీడీపీ నాయకులతో కలిసి కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో బుధవారం ఎమ్మెల్యే ఉగ్రను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ షాపులు లీజుకు ఇచ్చేందుకు అధికారులు ప్రకటన ఇచ్చి వాయిదా వేసిన విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు అడుగుకు రూ.60 చెల్లించేందుకు అంగీకరించారు. రెండేళ్లకు 10 శాతం అద్దె పెంచి నెలనెల బాడుగలు దేవస్థానానికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రను కలిసిన వారిలో పామూరు టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, షేక్ ఖాజారహంతుల్లా, యారవ శ్రీనివాసులు, వాసవీ మాత దేవస్థాన గౌరవ అధ్యక్షుడు వీ సత్యనారాయణ, పందిటి హరీష్, మెంటా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.