విస్తారంగా పొగాకు సాగు
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:23 AM
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరి గింది. ఏళ్లగా సాగు చేస్తున్న సాంప్రదాయ పంటలకు రైతులు రోజురోజుకు స్వస్తి చెబుతు న్నారు.
పుల్లలచెరువు, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరి గింది. ఏళ్లగా సాగు చేస్తున్న సాంప్రదాయ పంటలకు రైతులు రోజురోజుకు స్వస్తి చెబుతు న్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆదాయం వస్తుందనే ఆశతో పొగాకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. తీవ్ర కరువుతో పంటలకు నీరు అందుతుందన్న నమ్మకం లేక రైతులు తక్కువ నీటితో సాగయ్యే పొగాకు వైపు ఆసక్తి చూపుతున్నారు.
మూడేళ్ల క్రితం పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో మిర్చి,పత్తి, కంది పంటలను విస్తృతంగా సాగు చేసేవారు. అయితే పైరు పూత, కాయ దశలో ఉన్నప్పుడు తీవ్ర వర్షభావంతో పంటలు మధ్యలోనే ఎండుముఖం పట్టి దిగుబడి గణనీయం తగ్గుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పుల్లలచెరువు మండలంలో కొంతమంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. గత రెండు మూడేళ్లగా ఈ పైరు రైతు లకు లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో సదరు రైతులు తమ అనుభవాలను మిగి లిన రైతులకు చెప్పడంతో మిగిలిన వారు సాగు చేపడుతున్నారు. పొగాకు కంపెనీలు కూడా మార్కెట్టుకు తగ్గట్టుగా క్వింటాకు రూ.15 నుంచి రూ.18 వేల వరకు స్ధానికంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇటు రైతులతో పాటు రైతు కూలీలకు మంచి కూలీ లభిస్తుండటంతో రైతులు పొగాకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పొగాకు సాగు వల్ల ఈ మండలాల్లో కంది, పత్తి, మిరప పైర్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వైపాలెం నియోజకవర్గంలో సూమారు 8 వేల హెక్టార్లకు పైగాఈ ఏడాది పొగాకు సాగైంది.