Share News

అడుగంటిన మంచినీటి చెరువులు

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:01 PM

పర్చూరు నియోజకర్గంలో తాగునీటి చెరువులు అడుగుంటుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో పూర్తిగా అడుగంటగా కొన్ని చెరువుల్లో రేపో మాపో అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఉన్న అరా కొరా నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉన్నాయి. దీనికి తోడు దుర్గంధం వెదజల్లటంతో గత్యంతరం లేక అదే నీటితో కాలం వెల్లబుచ్చాల్సిన దుస్థితి నెలకొంది.

అడుగంటిన మంచినీటి చెరువులు
నాగులపాలెంలో ఎండిపోయిన మంచినీటి చెరువు

ఉన్ననీరు కలుషితం.. ఆపై దుర్గంధం

ఆ నీటితోనే కాలం వెల్లబుచ్చుతున్న ప్రజలు

పర్చూరు, మార్చి 29: పర్చూరు నియోజకర్గంలో తాగునీటి చెరువులు అడుగుంటుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో పూర్తిగా అడుగంటగా కొన్ని చెరువుల్లో రేపో మాపో అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఉన్న అరా కొరా నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉన్నాయి. దీనికి తోడు దుర్గంధం వెదజల్లటంతో గత్యంతరం లేక అదే నీటితో కాలం వెల్లబుచ్చాల్సిన దుస్థితి నెలకొంది. చెరువుల్లో ప్రస్తుతం ఉన్ననీటిని ఆయా పంచాయతీల కుళాయిల ద్వారా రెండు నుంచి మూడు రోజులకు ఒక సారి సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు వేసవి నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరుకాస్త అడుగుంటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెరువుల్లో ఉన్న నీరు కాస్త కలుషితంగా మారిపోవటంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. నిరుపేదలు మాత్రం పంచాయతీల ద్వారా సరఫరా చేస్తున్న కలుషిత నీటితోనే సరిపెట్టుకుంటున్నారు.

పొంచిఉన్న నీటి ఎద్దడి...

ఇప్పటికే అనేక గ్రామాల్లో చెరువులు అడుగంటడం, ఉన్న నీరుకాస్త రంగుమారి కలుషితంగా తయారు కావటంతో ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. చెరువులను నింపుకుందామ న్నా ఎక్కడా అందుబాటులో నీరు లేకపోవటంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఎన్‌ఎ్‌సపీ పరిధిలో 63, కేడబ్ల్యూసీ పరిధిలో 18 ఉన్నాయి. దాదాపు ఉన్న అన్నీ చెరువులు అడుగంటి పోయి కనిపిస్తున్నాయి.

మూగ జీవుల పరిస్థితి దయనీయం...

ఓ పక్క మండే ఎండలు, మరో పక్క చెరువుల్లో నీరు అడుగంటడం, పంచాయతీల ద్వారా నీరు సక్రమంగా సరఫరా కాకపోటంతో చాలీ చాలని నీటితో మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని వారం రోజుల్లో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే పర్చూరు ప్రాంతం సాగర్‌ కాలువ అయకట్టు చివరి ప్రాంతం కావటం, ఉన్న సాగర్‌ కెనాల్‌లలో చిల్లచెట్లు పెరిగి పోవటంతో నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.

అధికారులు సకాలంలో స్పందించి, ప్రత్యేక చొరవ చూపితే తప్ప చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరే పరిస్థితి లేదు. కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారించి ఆయకట్టు చివర ఉన్న పర్చూరు ప్రాంత చెరువులకు నీటిని నింపితేనే వేసవి గండం నుంచి ప్రజలు బయట పడే అవకాశం ఉంది. ఆదిశగా జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Mar 29 , 2024 | 11:01 PM