కనిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:51 PM
కనిగిరి అబివృద్ధికి నిధులు కేటా యించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.
కనిగిరి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కనిగిరి అబివృద్ధికి నిధులు కేటా యించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. ఈసంద ర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నివేదికలు, ప్రతిపాదనలు సీ ఎంకు అందజేశారు. నియోజకవర్గంలో ట్రిపుల్‌ఐటీ, రోడ్ల పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికను అందజేశారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర తెలిపారు.