Share News

పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:20 PM

అద్దంకి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మం త్రి నారాయణను కలిసి కోరారు. అద్దంకి ప ట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలువకు రెండు వైపులా మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు.

పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలి
మంత్రి రవికుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న అద్దంకి డీసీ చైర్మన్‌ శ్రీనివాసరావు, పంగులూరు డీసీ వైస్‌ చైర్మన్‌ వీరాస్వామి, టీడీపీ నేతలు

మినీ బైపా్‌సకు నిధులు మంజూరు చేయాలి

మున్సిపల్‌ మంత్రి నారాయణను

కోరిన మంత్రి గొట్టిపాటి

అద్దంకి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మం త్రి నారాయణను కలిసి కోరారు. అద్దంకి ప ట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలువకు రెండు వైపులా మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించి అభివృద్ది కి సహకరించాలని రవికుమార్‌ కోరారు. వీధి దీపాలు, ఇతర బ్యూటిఫికేషన్‌ పనుల కోసం నిధులు కేటాయించాలని కోరినట్లు మం త్రి రవికుమార్‌ తెలిపారు. అద్దంకి మున్సిపాలిటీ లో చేపట్టే అభివృద్ధి పనులకు సరిపడా నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అద్దంకి డీసీ చైర్మన్‌, పంగులూరు వైస్‌ చైర్మన్‌

అద్దంకి డీసీ చైర్మన్‌ బండారుపల్లి శ్రీనివాసరావు, పంగులూరు డీసీ వైస్‌ చైర్మన్‌ ధూళిపాళ్ల వీరాస్వామి పలువురు టీడీపీ నేతలతో వెళ్లి అమరావతిలో మంత్రి రవికుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి, బల్లికురవ మండలాల టీడీపీ నేత లు కరి పరమేష్‌, చాగంటి రాజేంద్ర ప్రసా ద్‌, మలినేని గోవిందరావు ఉన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:20 PM