వైసీపీకి ఏఎంసీ మాజీ చైర్మన్ గుంటక గుడ్‌బై
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:23 AM
మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి వైసీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. స్థానిక ఎస్‌సీవీకే నిలయం (రీడింగ్ రూమ్)లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
మార్కాపురం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి వైసీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. స్థానిక ఎస్‌సీవీకే నిలయం (రీడింగ్ రూమ్)లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను 1989 నుంచి 2009 వరకు టీడీపీలో కొనసాగానన్నారు. 2009లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు వైసీపీలో కొనసాగు తున్నట్లు తెలిపారు. తనకు అన్ని పార్టీలు సముచిత కల్పించాయన్నారు. తన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్ షేక్ షెక్షావలి, అనుచరులు బత్తుల మల్లిఖార్జున్‌రెడ్డి, గుంటక శంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిట్టు తదితరులు పాల్గొన్నార