Share News

పచ్చి మిర్చి రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:21 AM

దళారులు కుమ్మక్కై పచ్చి మిర్చి ధరలను రోజు రోజుకు తగ్గిస్తున్నారని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో శుక్రవారం రాత్రి రైతులు రాస్తారోకో చేశారు. బహిరంగ మార్కెట్‌లో పచ్చి మిర్చి క్వింటాల్‌ ధర 2,500 నుంచి రూ.3వేలు ఉండగా, కొమ్మాలపాడులో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై క్వింటాల్‌ రూ.1200 నుంచి రూ.1300కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజులుగా వ్యాపారులు, దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధరలను దిగజారుస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చి మిర్చి రైతుల రాస్తారోకో
కొమ్మాలపాడులో నామ్‌ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు

దళారులు కుమ్మక్కై ధరలు

తగ్గిస్తున్నారని ఆగ్రహం

కొమ్మాలపాడు(అద్దంకి), డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దళారులు కుమ్మక్కై పచ్చి మిర్చి ధరలను రోజు రోజుకు తగ్గిస్తున్నారని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో శుక్రవారం రాత్రి రైతులు రాస్తారోకో చేశారు. బహిరంగ మార్కెట్‌లో పచ్చి మిర్చి క్వింటాల్‌ ధర 2,500 నుంచి రూ.3వేలు ఉండగా, కొమ్మాలపాడులో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై క్వింటాల్‌ రూ.1200 నుంచి రూ.1300కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజులుగా వ్యాపారులు, దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధరలను దిగజారుస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి సాగు చేసే రైతులలో అత్యధిక శాతం చిన్న, సన్న కారు రైతులు కావడంతో పెట్టుబడులకు స్థానికంగా ఉండే ఎరువుల దుకాణాల వ్యాపారులను ఆశ్రయించడంతో ప్రస్తుతం దిగుబడి వచ్చిన మిర్చిని వ్యాపారుల కనుసన్ననలలో ఉండే దళారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రై తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి రై తులు పెద్ద సంఖ్యలో నామ్‌ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌ రెండు వైపులా నిలిచిపోయింది. సంతమాగులూరు పోలీసులు చే రుకొని విరమింప చేశారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే రైతు సం ఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని రైతు సంఘం నేత ఖాదర్‌ బాషా తెలిపారు.

Updated Date - Dec 07 , 2024 | 12:21 AM